Asianet News TeluguAsianet News Telugu

రెండో టీ20కి ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ...

మొదటి టీ20 లో చివరి వరకు పోరాడి విజయం సాధించిన ఆసిస్ జట్టుకు రెండో వన్డేకు ముందే ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా విశాఖలో జరిగిన మొదటి టీ20 కి దూరమైన బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ రెండో మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని ఆసిస్ భావించింది. అయితే అతడి గాయం ఇంకా తగ్గకపోవడంతో కేవలం బెంగళూరు టీ20కే కాదు వన్డే సీరిస్ కు కూడా దూరమయ్యాడు. 
 
Australia's Kane Richardson has been ruled out of the remainder of their tour to India
Author
Bangalore, First Published Feb 27, 2019, 6:56 PM IST

మొదటి టీ20 లో చివరి వరకు పోరాడి విజయం సాధించిన ఆసిస్ జట్టుకు రెండో వన్డేకు ముందే ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా విశాఖలో జరిగిన మొదటి టీ20 కి దూరమైన బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ రెండో మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని ఆసిస్ భావించింది. అయితే అతడి గాయం ఇంకా తగ్గకపోవడంతో కేవలం బెంగళూరు టీ20కే కాదు వన్డే సీరిస్ కు కూడా దూరమయ్యాడు. 

టీ20 సీరిస్ కు ముందు హైదరాబాద్ లో జరిగిన ప్రాక్టీన్ సెషన్ లో రిచర్డ్ సన్ గాయపడ్డాడు. దీంతో మొదటి టీ20 కి దూరమయ్యాడు. గాయం ఇంకా తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఆస్ట్రేలియాకు పంపిస్తున్నట్లు ఆసిస్ జట్టు మేనేజ్ మెంట్ పేర్కొంది. అతడి స్థానంలో మీడియం పేసర్ ఆండ్రూ టైని జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 

ఆస్ట్రేలియా పర్యటనలో తమను ఘోరంగా ఓడించిన టీంమిండియాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఆసిస్ జట్టుకు వచ్చింది. విశాఖ టీ20 లో గెలిచిన ఆ జట్టు బెంగళూరులో ఇవాళ జరగనున్న రెండో టీ20ని కూడా గెలిచి సీరిస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ సమయంలో ఇలా కీలక ఆటగాడు జట్టుకు దూరమవడం ఆసిస్ పై ప్రభావం చూపించనుంది. 

అయితే మొదటి టీ20 లో గెలవాల్సిన మ్యాచ్ ను ఓడిపోయిన టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో రెండో టీ20 గెలవాలని భావిస్తోంది. దీని ద్వారా సీరిస్ ను సమం చేసి ఆసిస్ ఆశలపై నీళ్లు చల్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో రిచర్డ్ సన్ ఆసిస్ జట్టుకు దూరమవడం భారత్ కు అనుకూలించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios