మాంచెస్టర్: న్యూజిలాండ్ పై మంగళవారం జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచులో సెంటిమెంట్ ఇండియాకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇండియాకు ఏడు నెంబర్ కలిసి వస్తుందని అంటున్నారు. గత చరిత్రను పరిశీలిస్తే ఇండియాకు ఏడు లక్కీ నెంబర్ గానే కనిపిస్తోంది. 

ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా పాకిస్తాన్ ను ఏడు సార్లు ఓడించింది. న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఏడోసారి ఆడుతోంది. ఏడు సార్లు సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరుకుంది. 2015 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. 

న్యూజిలాండ్, ఇండియా ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఇండియా ట్రాక్ రికార్డే మెరుగ్గా ఉంది. ఇండియా నాలుగు సార్లు విజయం సాధించగా, న్యూజిలాండ్ మూడు సార్లు గెలిచింది. అందువల్ల మంగళవారం జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచులో ఇండియాదే పైచేయి అవుతుందని అంచనా వేస్తున్నారు