మరికొద్ది గంటల్లో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సఫారీ బౌలర్ రబాడలు ఆఫ్ ది గ్రౌండ్ పోటీ పడుతున్నారు.

ఈ క్రమంలో తనపై రబాడ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు విరాట్ కోహ్లీ. అతను చేసిన వ్యాఖ్యలు అపరిపక్వత వ్యాఖ్యలు అర్ధం లేనివన్నాడు. మనం ముఖాముఖిగా మాట్లాడుకోవాలని కోహ్లీ సూచించాడు.

కానీ వ్యక్తిగత విషయాలు బహిరంగంగా మాట్లాడటం సరికాదని విరాట్ అన్నాడు. అంతేకాకుండా మీడియా సమావేశంలో బౌలర్ రబడ గురించి తాను మాట్లాడబోనని కోహ్లీ స్పష్టం చేశాడు.

ఏ విషయాన్నైనా రబడతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని విరాట్ పేర్కొన్నాడు. అయితే అతను ఎల్లప్పుడూ ప్రతిభ గల బౌలర్ అని కోహ్లీ ప్రశంసించాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో వీరిద్దరూ గ్రౌండ్‌లో హోరాహోరి తలపడ్డారు.