లండన్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇండియాపై జరిగిన మ్యాచులో ఓటమిపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై పాకిస్తాన్ జట్టు ఓటమి తనను తీవ్రంగా బాధించిందని, ఆ బాధలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన అన్నారు.

భారత్‌ పై ఓటమితో గత ఆదివారంనాడు తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే అది ఒక మ్యాచులో పేలవమైన ప్రదర్శన మాత్రమేనని. ప్రపంచకప్‌ అంటే మీడియా ప్రత్యేకమైన దృష్టి వల్ల, అభిమానులు అంచనాల వల్ల  పరాజయాలు కలిగితే ఒత్తిడి విపరితీంగా ఉంటాయని అన్నారు. అన్ని జట్లు కూడా అలాంటి ఆయన అన్నారు. 

తమ ప్రదర్శన మెరుగుపరుచుకోవాలని అన్ని సమయాల్లోనూ ఆటగాళ్లతో చెబుతామని అన్నారు. ఫకార్, ఇమామ్‌లు మంచి ఆరంభం ఇచ్చారని, కానీ వాళ్లు ఔట్ కాగానే ఆందోళన ప్రారంభమైందని అన్నారు. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నామని,  ఇది ప్రపంచ కప్ కావడంతో మీడియా, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని అన్నాడు. దానివల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అన్నారు.