లండన్: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు కానీ ప్రపంచ కప్ పోటీల్లో స్లెడ్జింగ్ ని, వీక్షకులు కలిగించే ఇబ్బందులను ఎదుర్కోవడానికి చర్మం మందం చేసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. 

స్మిత్, వార్నర్ 2018లో దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పపడినందుకు సస్పెన్షన్ కు గురై తిరిగి ఆటలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ రెండు వార్మప్ మ్యాచుల్లో వారు చిక్కులు ఎదుర్కున్నారు. 

ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు తిరిగి వచ్చినందుకు వారిద్దరు సంతోషంగా ఉండాలని లీ అన్నాడు. ఐపిఎల్ లో డేవిడే వార్నర్ లీడింగ్ రన్ స్కోరరుగా, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా అవతరించాడని ఆయన గుర్తు చేశాడు. తొలి మ్యాచులోనే స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించాడని ఆయన అన్నాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోకి వారిద్దరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారని, విజయం సాధించడానికి వారికి తగిన అవకాశం కల్పించారని ఆయన అన్నారు. కెవిన్ పీటర్సన్ వంటి వారి స్లెడ్జింగ్ ను తట్టుకోవడానికి చర్మాన్ని కాస్తా మందం చేసుకుంటే సరిపోతుందని అన్నాడు.