ప్రపంచకప్ అంటేనే భావోద్వేగాలతో కూడుకున్న వ్యవహారం. మైదానంలో తమ అభిమాన ఆటగాళ్లు.. సైనికుల్లా పోరాడుతూ ఉంటే ఫ్యాన్స్ కూడా అంతే ప్రాణం పెడతారు. ఈ క్రమంలో శనివారం పాక్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల అభిమానులు ఘర్షణ పడ్డారు.

మ్యాచ్ మధ్యలో ‘‘ జస్టిస్ ఫర్ బలూచిస్తాన్’’ అనే భారీ బ్యానర్ రాసివున్న ఓ విమానం మైదానం మీదుగా వెళ్లింది. దీనిని గుర్తు తెలియిన ఆఫ్గన్ అభిమానులు పంపినట్లుగా తెలుస్తోంది. అంతే ఈ విమానం అలా వెళ్లిందో లేదో మైదానంలో పాక్, ఆఫ్గన్ అభిమానులు బాహాబాహీకి దిగారు.

ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో .. భద్రతా సిబ్బంది వారిని స్టేడియం నుంచి బయటకి పంపివేశారు. అయితే అక్కడ కూడా వారు కొట్టుకున్నారు. చేతికి దొరికిన వస్తువులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో అదనపు సిబ్బంద రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు.