ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ ధోనీ కొత్త గ్లోవ్స్‌ ధరించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ధోనీ ధరించిన గ్లోవ్స్‌పై ఆర్మీ బలిదాన్ చిహ్నం కలిగిన కీపింగ్ గ్లోవ్స్ వాడటంపై ఐసీసీ అభ్యంతరం తెలిపింది.

దీనిపై బీసీసీఐతో పాటు యావత్ భారతదేశం ధోనికి మద్ధతుగా నిలుస్తున్నారు. అయితే అది క్రీడా మైదానమని.. యుద్ధ మైదానం కాదని.. అలాంటి చోట బలిదాన్ లోగోలను ఉపయోగించవద్దని సునీల్ గవాస్కర్, జర్నలిస్ట్ శేఖర్ గుప్తాలు అభ్యంతరం తెలిపారు.

తను ధరించిన గ్లోవ్స్‌పై వివాదం రేగడంతో ధోనీ వెనక్కు తగ్గాడు. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా బలిదాన్ చిహ్నం లేని గ్లోవ్స్‌ను ధరించాడు.