ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగలనుందా...? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఓ వైపు టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుండగా  మరో వైపు ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఆటగాడు గాయపడుతున్నారు. భారత జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచులాడగా మూడింట్లోనూ విజయాన్ని అందుకుంది. అలాగే ముగ్గురు ఆటగాళ్లు గాయాలకు గురయ్యారు. వీరిలో ఓపెనర్ శిఖర్ ధావన్ అయితే బొటనవేలి గాయం కారణంగా ఏకంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమవ్వాల్సి వచ్చింది. 

అయితే యువ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ కుమార్ పరిస్థితి కూడా సేమ్ ధవన్ మాదిరిగానే వుందని తెలుస్తోంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భువీ తొడకండరాలు పట్టేయడంతో తదుపరి జరగనున్న అప్ఘాన్, వెస్టిండిస్ మ్యాచ్ లకు దూరం కానున్నాడని టీం మేనేజ్ మెంట్ ప్రకటించింది. అయితే అతడు ఇంగ్లాండ్ మ్యాచ్ లో అందుబాటులోకి వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. 

ధవన్ కూడా ఇంగ్లాండ్ మ్యాచ్ లో అందుబాటులో వస్తాడని చెప్పిన అధికారులు అనూహ్యంగా అతడు ప్రపంచ కప్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే భువనేశ్వర్ గాయం గురించి కూడా అధికారులు ఇంకా ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. అయితే గాయం తీవ్రత అధికంగా వుంటే అతన్ని కూడా ప్రపంచ కప్ కు ఆడుతున్న భారత జట్టులో చోటు కోల్పోనున్నాడు. 

ఇదే జరిగితే భువీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న అనుమానం అందరిలో కలుగుతోంది. అయితే స్టాండ్ బై ఫేసర్ గా ఎంపికైన ఇషాంత్ శర్మతోనే ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం. భువీ పిట్ నెస్ నిరూపించుకోలేకపోతే బిసిసిఐ నుండి ఇషాంత్ కు పిలుపు రావచ్చని క్రీడా వర్గాల్లో అప్పుడే చర్చ మొదలయ్యింది. 

ఇక మరో యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నెట్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. భువీ విసిరిన ఓ యార్కర్ నేరుగా శంకర్ కాలికి తగలడంతో అతడి నొప్పితో విలవిల్లాడిపోయాడు. అయితే ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు...ఈ విషయంలో ఆందోళన చెందదాల్సిన అవసరం లేదని స్వయంగా బుమ్రానే ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

2019 వరల్డ్ కప్ లో భారత్ తలపడే మ్యాచుల షెడ్యూల్