ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో బలమైన ప్రత్యర్థులను సైతం అలవోకగా మట్టికరిపించిన టీమిండియా తదుపరి మ్యాచ్ లో పసికన అప్ఘానిస్తాన్ తో పోరాడాల్సి వుంది. అయితే టీమిండియా ఆటగాళ్లు మాత్రం అప్ఘాన్ ను బలహీనమైన జట్టులా కాకుండా బలమైన ప్రత్యర్థిగానే భావిస్తూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా మైదానంలో నెట్ ప్రాక్టీస్ తో పాటు ఫుట్ బాట్ ఆడుతూ తెగ సాధన చేస్తున్న భారత ఆటగాళ్ల వీడియోను బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 

ఇలా భారత ఆటగాళ్లు ఫుట్ బాల్ ఆడుతూ బంతిని ఎంతసేపు కుదిరితే అంతసేపు గాల్లో వుంచడానికి ప్రయత్నించారు. ఇలా ఫుట్ బాల్ ను చేత్తో తాకకుండా, కేవలం తల, కాళ్ళను ఉపయోగిస్తూ దాదాపు  41 సార్లు బాదుతూ గాల్లోనే వుంచారు. ఈ  వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ బిసిసిఐ అభిమానులకు ఓ సవాల్ విసింరింది.''టీమిండియా నెట్ ప్రాక్టీస్ కు ముందు సరదాగా వార్మప్ చేసింది. ఆటగాళ్లు 41 సార్లు బంతిని కిందపడకుండా ఆపారు.  ఇలా చాలాసేపు  బంతిని గాల్లోనే వుంచగలిగారు. అదే మీరయితే(అభిమానులు) ఎన్నిసార్లు ఇలా చేయగలరు...?'' అంటూ ప్రశ్నించింది. 

 

ఇక మరో ట్వీట్ లో బుమ్రా బౌలింగ్ లో గాయపడ్డ విజయ్ శంకర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న వీడియోను పోస్ట్ చేసింది. అయితే కొద్దిసేపు మాత్రమే నెట్ ప్రాక్టీస్  లో పాల్గొన్న విజయ్ ఎక్కువగా జాగింగ్ చేస్తూ కనిపించాడు. తన ప్రాక్టీస్ ఎలా సాగుతుందో కూడా స్వయంగా విజయే వివరించాడు. 
 

సంబంధిత వార్తలు

2019 వరల్డ్ కప్ లో భారత్ తలపడే మ్యాచుల షెడ్యూల్