లీగ్ దశలో అద్భతంగా ఆడిన టీమిండియా సెమీఫైనల్లో చతికిలపడింది. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 221 పరుగుల వద్దే ఆలౌటయ్యింది. దీంతో కివీస్ 18  పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్లోకి ప్రవేశించింది.  

మంగళవారం  మొదలైన మ్యాచ్ వర్షం కారణంగా ఇవాళ్టిన వాయిదా పడ్డ విషయం తెలిసిందే. నిన్న 46.1 ఓవర్లలో 211 పరుగులు  చేసిన కివీస్ వద్ద ఇవాళ మరో 28 పరుగులు చేసింది. దీంతో 239 పరుగులలను పూర్తిచేసుకున్న కివీస్ భారత్ కు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అయితే లక్ష్యఛేదనకు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు కేవలం తలో పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు. అయితే మధ్యలో రిషబ్ పంత్ 32, హార్దిక్ పాండ్యా 32 పరుగులతో ఆదుకున్నారు.,ఆ తర్వాత రవీంద్ర జడేజా-ధోని జోడి సెంచరీ భాగస్వామ్యంతో భారత్ గెలుపుపై ఆశలు రేకెత్తించారు. 

కానీ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా కీలక సమయంలో ఔటయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన ధోని కూడా  216 పరుగుల వద్ద రనౌటయ్యాడు. దీంతో  భారత గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. 18 పరుగుల తేడాతో గెలిచిన కివీస్ వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరింది.  

 న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైనా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. అతడు కేవలం 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. అయితే   భారత విజయానికి 13 బంతుల్లో 32 పరుగులు అవసరమైన దశలో జడేజా(77 పరుగులు) ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ భాారీ  షాట్ కు ప్రయత్నించి కెప్టెన్ విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.   

టీమిండియా ఆరోో వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న హార్ధిక్ పాండ్యా(32 పరుగులు) అనవసరంగా  భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోతున్న సమయంలో బ్యాటింగ్ కు దిగి కాస్సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న రిషబ్ పంత్(32 పరుగులు) ఔటయ్యాడు.  

మాంచెస్టర్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా టాప్ ఆర్డర్ పెవిలియన్ కు క్యూకట్టింది. కేవలం ఐదు పరుగులకే మూడు కీలక వికెట్లు పడ్డాయి. రోహిత్, కోహ్లీలు కేవలం ఒక్కో పరుగు మాత్రమే చేసి  ఔటయ్యారు. వారి బాటలోనే మరో ఓపెనర్ రాహుల్ కూడా నడిచాడు.  

  మంగళవారం 46.1 ఓవర్లలో 211 పరుగుల వద్ద నిలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఇవాళ(బుధవారం) ప్రారంభమైంది. అయితే ఆరంభం నుండే ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి టేలర్(74 పరుగులు) రనౌటయ్యాడు. దీంతో  225 పరుగుల వద్ద ఐదో వికెట్ పడింది. ఆ వెంటనే భువీ బౌలింగ్ లాథమ్ , హెన్రీలు కూడా వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో ఇవాళ నాలుగు ఓవర్లలో మరో 28 పరుగులు మాత్రమే జోడించి కివీస్ 139 పరుగులు చేసింది.  

 వర్షం కారణంగా నిన్న(మంగళవారం) అర్థాంతరంగా ఆగిపోయిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యింది. న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 211 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి బ్యాటింగ్  చేస్తున్న సమయంలో వర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. ఇలా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే వుండటంతో మ్యాచ్ ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో నిన్న ఎక్కడయితే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడినుండే ఇవాళ మ్యాచ్ ప్రారంభమయ్యింది.   

నిన్నటి(మంగళవారం) మ్యాచ్ విశేషాలు 

ప్రపంచ కప్ సెమీస్: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ రేపటికి వాయిదా