ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ అవకాశాలను సజీవంగా వుంచుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక అద్భుత ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్ లో రాణించి విండీస్ పై 23 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పని చేసిన విండీస్ 315 పరుగులకే పరిమమితమై మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 

భారీ లక్ష్యాన్న ఛేదిచడానికి బరిలోకి దిగిన విండీస్ ను యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ ఆదిలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్(5 పరుగులు), హోప్స్(5 పరుగులు) వెంటవెంటనే ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత విధ్వంసకర బ్యాట్ మెన్ గేల్(35 పరుగులు)ను కూడా రజిత ఔట్ చేశాడు. ఇలా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకుంటున్న విండీస్ ను పూరన్ ఆదుకున్నాడు. 

తన వీరోచిత పోరాటంతో జట్టును లక్ష్యఛదనవవైపు నడిపిస్తూ పూరన్ సెంచరీతో అదరగొట్టాడు.అతడికి అలెన్(51 పరుగులు) సహకారం అందించాడు. అయితే హాఫ్ సెంచరీ సాధించిన  వెంటనే అలెన్,  118 పరుగుల వద్ద పూరన్ లు ఔటయ్యారు. దీంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 315 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ 3 వికెట్లు పడగొట్టాడు. రజితచ వాండర్సె, మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. 

  భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వుండటంతో వేగంగా ఆడే క్రమంలో విండీస్ ఆటగాళ్లు వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. కెప్టెన్ హోల్డర్(26 పరుగులు)ను వాండర్సె ఔట్ చేశాడు. ఆ వెంటనే బ్రాత్ వైట్(8 పరుగులు) ఓ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. అంతకు ముందు విండీస్ 84 పరుగుల వద్దే నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డ హెట్మెయర్( 29 పరుగులు) ను డిసిల్వా రనౌట్ చేశాడు. 

ప్రమాదకరంగా మారుతున్న విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ను లంక బౌలర్లు సమర్ధవంతంగా అడ్డుకున్నారు. 35 పరుగులు చేసిన అతడు రజిత బౌలింగ్ లో ఔటయ్యాడు.  

మలింగ యార్కర్ల ధాటికి  వెస్టిండిస్ బ్యాట్ మెన్స్ తడబడుతున్నారు. ఇప్పటికే ఓపెనర్ ఆంబ్రిస్ ను పెవిలియన్ కు పంపిన మలింగ్ రెండో వికెట్ ను కూడా తన ఖాతాలోకే వేసుకున్నాడు. హోప్స్(5 పరుగులు)  ను కూడా ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన మలింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.  

 ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ అవకాశాలను సజీవంగా వుంచుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ శ్రీలంక అద్భుతంగా ఆడింది. టాస్ ఓడిపోయి మొదట  బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు ఏకంగా 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫెర్నాండో(104 పరుగులు) అద్భుత సెంచరీ, ఓపెనర్ పెరెరా (64 పరుగులు) హాాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లంక నిర్ణీత ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోరు సాధించింది. మిగతా ఆటగాళ్లలో తిరుమనే (45 పరుగులు) నాటౌట్, మెండిస్(39 పరుగులు), కెప్టెన్ కరుణరత్నే(32 పరుగులు) లు రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ ఒక్కడే రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కోట్రెల్, థామస్, అలెన్ తలో వికెట్ పడగొట్టారు. 

  హాప్ సెంచరీతో శ్రీలంక ను ఆదుకున్న కుశాల్ పెరెరా( 64 పరుగులు 51 బంతుల్లో) అనవసరమైన పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. బ్రాత్ వైట్ బౌలింగ్ లో రెండో పరుగుకోసం ప్రయత్నించిన పెరెరాను కోట్రెల్ ఓ అద్భుతమైన త్రో తో ఔట్ చేశాడు. దీంతో 104 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. 

 ప్రపంచ కప్ టోర్నీలో  మరో రసవత్తర మ్యాచ్ కు చెస్టర్‌ లీ స్ట్రీట్‌ స్టేడియం సిద్దమయ్యింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో సెమీస్ అవకాశాలను కోల్పోయిన వెస్టిండిస్...నాలుగో స్థానం కోసం పోటీ పడుతున్న శ్రీలంక జట్లు ఇవాళ(సోమవారం) ఇక్కడ తలపడ్డాయి. శ్రీలంక కూడా ఇప్పటికే దాదాపు సెమీస్ అవకాశాలను కోల్పోయినట్లే కనిపిస్తున్నా కొన్ని సమీకరణాలు ఫలిస్తే ఆ అవకాశం రానుంది. అది  కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే. దీంతో ఎట్టిపరిస్థితుల్లో గెలిచి  తీరాలన్న కసితో లంక బరిలోకి దిగుతుండగా...విండీస్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలసి చూస్తోంది. 

ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన  టాస్ ను వెస్టిండిస్ గెలచుకుంది. దీంతో కెప్టెన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇలా శ్రీలంక మొదట బ్యాటింగ్ కు దిగాల్సి వస్తోంది. 

తుది జట్లు:

శ్రీలంక టీం:

దిముత్‌ కరుణరత్నె(కెప్టెన్‌), కుశాల్ పెరెరా(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, ఎంజెలో మాథ్యూస్‌, లాహిరు తిరుమన్నె, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదానా, జాఫ్రే వాండెర్సే, కసున్ రజిత, లసిత్ మలింగ, 

 వెస్టిండీస్‌ టీం: 

క్రిస్ గేల్, సునీల్ ఆంబ్రిస్, హోప్స్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, హెట్మెయర్, జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, ఫాబియన్‌ అలెన్‌, షెల్డన్‌ కట్రెల్‌, ఒశానే థామస్‌.. గాబ్రియెల్