ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో  బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. వెస్టిండిస్ వంటి బలమైన జట్టుపై  ఏకంగా 322 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి సంచలనం సృష్టించింది. అదికూడా కేవలం 41.3 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరోసారి అద్భుతం చేసింది. ఇంతకు ముందు సౌతాఫ్రికాను మట్టికరిపించిన బంగ్లా తాజాగా విండీస్ ను ఓడించి  తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించుకుంది. 

 వెస్టిండిస్ నిర్దేశించిన 322  పరుగుల లక్ష్యాన్నిఛేధించడంలో  ఆల్ రౌండర్ షకిబల్ హసన్,, లిట్టన్ దాస్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షకిబ్ 99  బంతుల్లో 124. లిట్టర్ దాస్ 69 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్ గా నిలిచి బంగ్లాను విజయతీరాలకు  చేర్చారు. అంతకు ముందు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ 48, సౌమ్య సర్కార్ 29 పరుగులతో తమ వంతు సాయం అందించారు. ముష్పికర్ రహీమ్ ఒక్కడే 1 పరుగు మాత్రమే చేసి ఔటై కాస్త నిరాశపర్చాడు. 

ఇక బంగ్లా బౌలర్లను అడ్డుకోవడంలోో  విండీస్్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.రస్సెల్,థామస్ ఇద్దరు చేరో వికెట్ మాత్రమే పడగొట్టగా మిగతా వారు ఆమాత్రం ప్రయత్నం కూడా చేయలేరు. దీంతో బంగ్లా గెలుపు సాధ్యమయ్యింది. 

అంతకుముందు బ్యాట్ మెన్స్ సమిష్టిగా రాణించడంతో బంగ్లాకు విండీస్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ  క్రమంలో హోప్స్ 94 పరుగుల వద్ద ఔటయి సెంచరీకి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక మిగతావారిలో లూయిస్ 70, హెట్మయర్ 50, హోల్డర్ 33, పూరన్ 25 పరుగులతో రాణించారు. బంగ్లా  బౌలర్లలో సైఫుద్దిన్ 3, రహ్మాన్ 3, షకిబ్  2 వికెట్లు  పడగొట్టారు.   

దాటిగా ఆడుతూ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డ విండీస్ కెప్టెన్ హోల్డర్ ఔటయ్యాడు. కేవలం 15 బంతుల్లోనే 30 పరుగులు చేసిన అతడు సైఫుద్దిన్ బౌలింగ్  లో ఔటయ్యాడు.  మరోవైపు రహ్మాాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట హెట్మయర్ ను ఔట్ చేసి ఆ వెంటనే  రస్సెల్ వికెట్ ను కూడా పడగొట్టాడు. ఇలా క్రీజులోకి వచ్చి  కేవంల 2  బంతులను మాత్రమే ఎదుర్కొన్న రస్సెల్ పరుగులేమీ సాధించకుండానే ఔటయ్యాడు. 

బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోడంలో విండీస్ ఆటగాడు పూరన్ విఫలమయ్యాడు. అతడు కేవలం 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటయ్యాడు. ఇతడి వికెట్ ను కూడా షకిబల్ హసనే పడగొట్టాడు. దీంతో  విండీస్ 159 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

గేల్ డకౌట్ తర్వాత నిలకడగా ఆడుతూ అర్ధశతకంతో  విండీస్ ఆదుకున్న లూయిస్ ఔటయ్యాడు. 67 బంతుల్లోనే 70 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న అతన్ని షకీబుల్ హసన్ ఔట్ చేశాడు. దీంతో 122 పరుగుల వద్ద కరీబియన్ టీం రెండో వికెట్ కోల్పోయింది. 

బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండిస్ కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్రిస్ గేల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. సైఫుద్దిన్ బౌలింగ్ లో  కీపర్ రహీమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆరు పరుగులకే విండీస్ మొదటి వికెట్ కోల్పోయింది. 

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ(సోమవారం) వెస్టిండిస్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరిగింది.  టౌన్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను బంగ్లా గెలుచుకుంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ మోర్తజా ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపడంతో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేపట్టింది.

వెస్టిండిస్ టీం:

క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్,  హోప్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, హెట్మెయర్, ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్(కెప్టెన్), కోట్రెల్, థామస్, గాబ్రియెల్

బంగ్లాదేశ్ టీం:

తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముష్పీకర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, లిట్టర్ దాస్, మొసద్దిక్ హుస్సెన్, మెహదీ హసన్ మీరజ్, మహ్మద్ సైఫుద్దిన్, మోర్తజా(కెప్టెన్), ముస్తీఫిజూర్ రహ్మాన్