Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: బంతితో చెలరేగిన స్టార్క్... మరో అద్భుత విజయాన్ని అందుకున్న ఆసిస్

ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించి మంచి ఊపుమీదున్నట్లు కనిపించిన వెస్టిండిస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా జట్టుతో నాటింగ్ హామ్ వేదికగా తలపడ్డ విండీస్ జట్టు ఓటమిని చవిచూసింది. ఇలా విండీస్  ఈ ప్రపంచ కప్ లో మొదటి ఓటమిని చవిచూడగా...ఆసిస్ మాత్రం వరుసగా రెండో గెలుపును అందుకుంది. 

world cup 2019: west indies vs australia match updates
Author
Nottingham, First Published Jun 6, 2019, 2:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించి మంచి ఊపుమీదున్నట్లు కనిపించిన వెస్టిండిస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా జట్టుతో నాటింగ్ హామ్ వేదికగా తలపడ్డ విండీస్ జట్టు ఓటమిని చవిచూసింది. ఇలా విండీస్  ఈ ప్రపంచ కప్ లో మొదటి ఓటమిని చవిచూడగా...ఆసిస్ మాత్రం వరుసగా రెండో గెలుపును అందుకుంది. 

మొదట బ్యాటింగ్ కు  దిగిన ఆసిస్ 289 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ జట్టుముందుంచింది. అయితే లక్ష్యఛేదనకు దిగిన  విండీస్ ఓపెనర్లు లూయిస్, గేల్ లను తొందరగానే పెవిలియన్ పంపి ఆసిస్ బౌలర్లు మిగతా జట్టు సభ్యులను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో వికెట్లను కాపడుకోడానికే బ్యాట్ మెన్స్ ప్రాధాన్యతనివ్వడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. హోప్ 68 పరుగులు చేయడానికి 105  బంతుల్ని ఆడాడంటే విండీస్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే మిడిల్ ఓవర్లలో పూరన్ 40, హోల్డర్ 50 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించినా కీలక సమయంలో ఔటయ్యారు. దీంతో చివరకు విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి273 పరగులు చేసి విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఆసిస్ గెలుపు ఖాయమయ్యింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్  విండీస్ జట్టునుు బెంబేలెత్తించాడు. అతడు 10 ఓవర్లపాటు బౌలింగ్ చేసి కేవలం 46 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికట్లు పడగొట్టాడు. అతడికి తోడుగా కమ్మిన్స్ 2, జంపా ఒక వికెట్ పడగొట్టారు. 

 అంతకు ముందు మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు విండీస్ జట్టు బౌలర్ల దాటికి విలవిల్లాడిపోయింది. అయితే ఆసిస్ మిడిలార్డర్ ను అడ్డుకోవడంలో మాత్రం విండీస్ బౌలర్లు తడబడ్డారు. దీంతో పట్టు కోల్పోయిన విండీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంలో ఆసిస్ 288 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఆస్ట్రేలియా జట్టు 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి  జారుకున్న సమయంలో స్మిత్ (73 పరగులు),క్యారీ (45 పరుగులు)లు చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కౌల్టర్ నైల్ చెలరేగిపోయాడు. అతడు 60 బంతుల్లోనే 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో థామస్, కోట్రెల్, రస్సెల్ తలో రెండు, బ్రాత్ వైట్ 3, హోల్డర్ ఒక వికెట్ పడగొట్టారు. 

ఆసిస్ బ్యాట్ మెన్స్ స్మిత్, క్యారీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు వికెట్ పడకుండా సమయోచితంగా ఆడటంతో ఆసిస్ 30 ఓవర్లలో 147 పరుగులతో పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే ఈ సమయంలో హాఫ్ సెంచరీ(45 పరుగులు)కి  చేరువైన క్యారీ వికెట్ కోల్పోయాడు. రస్సెల్ ఓ అద్భుతమైన బంతితో ఈ జోడిని విడగొట్టాడు. దీంతో 147 పరుగుల వద్ద  ఆసిస్ ఆరో వికెట్ కోల్పోయింది. 

ఆస్ట్రేలియా జట్టు వికెట్ల పతనం కొనసాగుతోంది. 79 పరుగుల వద్ద స్టోయినీస్ వికెట్ ను హోల్డర్ పడగొట్టాడు. దీంతో కాస్సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన స్మిత్, స్టోయినిస్ జోడీ విడిపోయింది. విండీస్ బౌలర్ల  దాటికి ఆసిస్ టాప్ ఆర్డర్ బ్యాట్ మెన్స్  విలవిల్లాడిపోయారు. కనీస పరుగులు కూడా సాధించలేక పెవిలియన్ కు క్యూ కట్టారు. ఉస్మాన్ ఖవాజా (13 పరుగులు) ను రస్సెల్ ఔట్ చేశాడు. ఆ వెంటనే కోట్రెల్ మ్యాక్స్ వెల్ ను డకౌట్ చేశాడు. దీంతో ఆసిస్ 38 పరుగులకే నాలుగు  వికెట్లు కోల్పోయింది.

 టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (6 పరుగులు) ఔటయ్యాడు. విండీస్ బౌలర్ థామస్ వేసిన బంతిని సరిగ్గా అంచనాావేయలేక ఫించ్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆసిస్ జట్టు 26 పరుగులకే ఓపెనర్లిద్దరిని  కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. 

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నాటింగ్ హామ్ వేదికన ఇవాళ(గురువారం) రసవత్తమైన మ్యాచ్ జరిగింది. ఈ మెగా టోర్నీని అద్భుతమైన విజయాలతో ఆరంభించిన వెస్టిండిస్-ఆస్ట్రేలియాలు తలపడ్డాయి. పాకిస్థాన్  ను చిత్తుగా ఓడించి మంచి ఊపుమీదున్న విండీస్ ఆసిస్ పై కూడా అదే ఆటతీరును కనబర్చి విజయాన్ని అందుకోవాలని చూసి చతికిల పడింది. పసికూన బంగ్లాను ఓడించి ఈ  టోర్నీలో బోణీకొట్టిన ఆస్ట్రేలియా జట్టు విండీస్ ను కూడా ఓడించి విజయపరంపర కొనసాగించింది.   

  వెస్టిండిస్ జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. డారెన్ బ్రావో స్థానంలో లూయిస్ ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ హోల్డర్ తెలియజేశాడు.  ఆస్ట్రేలియా గత మ్యాచ్ లో ఆడిన ఆటగాళ్లనే కొనసాగిస్తున్నట్లు, ఎలాంటి మార్పులు లేవని ఫించ్ వెల్లడించాడు.  
  
తుది జట్లు:

ఆస్ట్రేలియా టీం:

ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టోయినీస్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), నాథన్ కుల్టర్ నైల్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

విండీస్ టీం:

క్రిస్ గేల్,  ఎవిన్ లూయిస్, హోప్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, హెట్మెయర్, జాసన్ హోల్డర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, కార్లోస్ బ్రాత్ వెట్, నర్స్, కోట్రెల్, థామస్ 
 

  

Follow Us:
Download App:
  • android
  • ios