ఇంగ్లాంండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీని వెస్టిండిస్ విజయంతో ముగిచింది. అయితే అప్ఘానిస్తాన్ కూడా అత్యుత్తమంగా ఆడి దాదాపు లక్ష్యాన్ని ఛేదించినంతపని చేసింది. అయితే లోయర్ ఆర్డర్ టపటపా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లలో 288 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఇలా కేవలం 23 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. 

312 పరుగులు భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన అప్ఘాన్ టాప్ ఆర్డర్ అదరగొట్టింది. కెప్టెన్ నయిబ్(5 పరుగులు) ఆరంభంలోనే ఔటయినా ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా రహ్మత్ షా(62 పరుగులు), ఇక్రమ్(86 పరుగులు) లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కూడా నజీబుల్లా(31 పరుగులు), అస్ఘర్ అప్ఘాన్(40 పరుగులు) లు ఆకట్టుకున్నారు. దీంతో ఓ దశలో అప్ఘాన్ ఇన్నింగ్స్ గెలుపు దిశగా సాగింది. అయితే ఈ నలుగరు ఔటయిన తర్వాత అప్ఘాన్ టపటపా వికెట్లు కోల్పోడంతో ఓటమి తప్పలేదు. 

విండీస్ బౌలర్లలో రోచ్ మూడు, బ్రాత్ వైట్ నాలుగు వికెట్లు పడగొట్టి అప్ఘాన్ ను దెబ్బతీశారు. థామస్, గేల్ లు తలో వికెట్ పడగొట్టారు. డేత్ ఓవర్లలో వీరు అద్భుతంగా బౌలింగ్ చేసి  వెంటవెంటనే వికెట్లు పడగొట్టి అప్ఘాన్ ను లక్ష్యాన్ని  ఛేదించనివ్వకుండా అడ్డుకున్నారు. 

విండీస్ బౌలర్ల ధాటికి అప్ఘాన్ టపటపా వికెట్లు కోల్పోతోంది. ఓ దశలో గెలుపు దిశగా సాగిన ఆ జట్టు బ్యాటింగ్ ప్రస్తుతం ఓటమి దిశగా సాగుతోంది. 138 పరుగులకే కేవలం రెండు వికెట్లు మాత్రమై కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచిన ఆ జట్టు 260 పరుగులకు వద్దకు వచ్చే సరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. 

194 పరుగుల వద్ద అప్ఘాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. నజీబుల్లా జద్రాన్ (31 పరుగులు) కీలక సమయంలో రనౌటయ్యాడు. అంతకు ముందు ఇక్రమ్ (86 పరుగులు) అద్భుత హాఫ్ సెంచరీతో ఆదరగొట్టాడు. అయితే అతన్ని గేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోడంతో మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

ఎట్టకేలకు అప్ఘాన్ రెండో వికెట్ పడగొట్టడంలో విండీస్ బౌలర్లు సఫలమయ్యారు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రహ్మత్ షా(62 పరుగులు) ను బ్రాత్ వైట్ ఔట్ చేశాడు. దీంతో 138 పరుగుల వద్ద అప్ఘాన్ రెండో వికెట్ కోల్పోయింది. 

312 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘాన్ కు విండీస్ బౌలర్ రోచ్ ఆదిలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ నయిబ్(5 పరుగులు) వికెట్ ను పడగొట్టి దెబ్బతీశాడు.  దీంతో ఆ జట్టు కేవలం 5 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. 

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో మొదటిసారి వెస్టిండిస్ జట్టు  సమిష్టిగా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ అప్ఘాన్ బౌలర్లను చితక్కొట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

ఈ మ్యాచ్ క్రిస్ గేల్ ఒక్కడే తక్కువ పరుగులు చేసి ఔటయ్యాడు. లూయిస్(58 పరుగులు), హోప్స్ 977 పరుగులు), పూరన్(58 పరుగులు) లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇక కెప్టెన్ హోల్డర్ (45 పరుగులు), హెట్మెయర్ (39 పరుగులు)లు ఫరవాలేదనిపించారు. ఇలా ఆటగాళ్లంతా రాణించడంతో విండీస్ భారీ పరుగులు సాధించింది.అప్ఘాన్ బౌలర్లలో దవ్లత్ జద్రాన్ 2, శిర్జాద్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్ లు తలో వికెట్ పడగొట్టారు. 

వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి జారుకుంటున్న వెస్టిండిస్ ను ఆదుకోడానికి ప్రయత్నించిన హోప్స్(77 పరుగులు) కూడా ఔటయ్యాడు. 192 పరుగుల వద్ద హోప్స్ ను నబి ఔట్ చేశాడు. అంతకు ముందు  హెట్మెయర్(39 ప రుగులు)ను దవ్లత్ జద్రాన్ పెవిలియన్ కు పంపించాడు.  

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ను అప్ఘాన్ ఆదిలోనే దెబ్బతీసింది. విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్(7 పరుగులు) ను దవ్లత్ ఆరంభంలోనే ఔట్ చేశాడు. దీంతో విండీస్ కేవలం 21 పరుగుల వద్దే మొదటి  వికెట్ కోల్పోయింది.ఆ తర్వాత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ లూయిస్(58 పరుగులు)ను  కూడా రషీద్ ఖాన్ ఔట్ చేశాడు.    

ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయిన అప్ఘానిస్తాన్, వెస్టిండిస్ జట్లు నామమాత్రపు మ్యాచ్ లో తలపడనున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్నఈ  రెండు జట్లు కేవలం  విజయంతో టోర్నీని ముగించాలని భావిస్తున్నాయి. ఇప్పటివరకు అసలు ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయిన అప్ఘాన్ విండీస్ ను ఓడించి ఆ సరదా తీర్చుకోవాలని చూస్తోంది.

ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన  టాస్ ను వెస్టిండిస్ జట్టు గెలుచుకుంది. దీంతో కెప్టెన్ హోల్డర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. కాబట్టి అప్ఘానిస్తాన్ మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్ చేయనుంది. 

తుది జట్లు:

వెస్టిండిస్:

క్రిస్ గేల్,  ఎవిన్ లూయిస్, హోప్స్, హెట్మెయర్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్(కెప్టెన్), కార్లోస్ బ్రాత్ వైట్, అలెన్, కోట్రెల్, కీమర్ రోచ్, థామస్

అప్ఘాన్: 

రహ్మత్ షా, గుల్బదిన్ నయిబ్(కెప్టెన్), అస్ఘాన్  అప్ఘాన్, మహ్మద్ నబి, సమీవుల్లా షిన్వరీ, నజీబుల్లా జద్రాన్, ఇక్రమ్ అలిఖిల్, రషీద్ ఖాన్, దవ్లత్ ఖాన్,  శిర్జాద్, ముజీబ్ ఉర్ రహ్మాన్