Asianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: రోహిత్ శర్మ అజేయ శతకం... దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీని టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. సౌతాంప్టన్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తలపడ్డ టీమింండియా సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. మొదట బౌలింగ్ లో బుమ్రా,చాహల్ అద్భుత ప్రదర్శన, బ్యాటింగ్ లో రోహిత్ శర్మ వీరోచిత సెంచరీ  కలిపి టీమిండియాకు ఘన విజయాన్ని అందించాయి. 

world cup 2019: team india vs south africa match updates
Author
Southampton, First Published Jun 5, 2019, 2:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీని టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది.సౌతాంప్టన్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తలపడ్డ టీమింండియా సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. మొదట బౌలింగ్ లో బుమ్రా,చాహల్ అద్భుత ప్రదర్శన, బ్యాటింగ్ లో రోహిత్ శర్మ వీరోచిత సెంచరీ  కలిపి టీమిండియాకు ఘన విజయాన్ని అందించాయి.

228పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఓపెనర్ రోహిత్ శర్మ  అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. అతడు  144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో అజేయంగా  నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి మొదట కెఎల్ రాహుల్ (26 పరుగులు) ఆ తర్వాత ధోని (34 పరుగుల) చక్కటి సహకారం అందించారు. అంతకుముందు ధావన్ 8,కోహ్లీ 18 పరుగులు మాత్రమే చేసి ఔటైన రోహిత్ ఒత్తిడికి గురికాకుండా సమయోచితంగా  ఆడాడు.  అందువల్లే టీమిండియా 47.3 ఓవర్లలోనే 230 పరుగులు చేసి విజయాన్ని అందుకోగలిగింది.

సౌతాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(8 పరుగులు) జట్టు స్కోరు కేవలం 13 పరుగుల వుండగానే ఔటయ్యాడు. రబడ బౌలింగ్ లో కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ(18 పరుగులు) కూడా ఫెహ్లుక్వాయో బౌలింగ్ జట్టు స్కోరు 54 పరుగుల వద్ద వుండగానే ఔటయ్యాడు.

భారత బౌలర్ల విజృంభణతో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 227 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే సపారీ జట్టు టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చడంతో సఫలమైన మన బౌలర్లు లోయర్ ఆర్డర్ ను అడ్డుకోలేకపోయారు. దీంతో కనీసం 200 స్కోరయినా సాధిస్తుందో, లేదోనన్న దశ నుండి సౌతాఫ్రికా 227 పరుగులు చేయగలింది. చివరి ఓవర్లలో మొర్రిస్ 42, ఫెహ్లుక్వాయో 34, రబడ 34 పరుగులతో ఆకట్టుకున్నారు.ఇలా మరోసారి చివరి ఓవర్లలో భారత బౌలర్ల వైఫల్యం బయటపడింది.

సౌతాఫ్రికా ను ఇన్నింగ్ ఆరంభంలోనే బుమ్రా కోలుకోలేని దెబ్బ తీశాడు. జట్టు స్కోరు కేవలం 24 పరుగుల వద్ద వుండగానే  ఓపెనర్లు ఆమ్లా, డికాక్ లను పెవిలియన్ కు పంపించి టీమిండియాకు శుభారంభాన్నిచ్చాడు. ఆ తర్వాత చాహల్ వికెట్ల వేట ప్రారంభించాడు. అతడు ఏకంగా  నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ 1, భువనేశ్వర్ చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టారు. 

 చాహల్ మణికట్టు మాయాజాలం ముందు సపారీ జట్టు నిలవలేపోతోంది. తాజాగా ఫెహ్లుక్వాయో(34 పరుగుల) చాహల్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. వికెట్ కీపర్ ధోని అత్యంత చాకచక్యంగా  వ్యవహరించి ఫెహ్లుక్వాయోను స్టంపౌట్ చేశాడు. దక్షిణాఫ్రికా వికెట్ల పతనాన్ని కాస్సేపు అడ్డుకున్న డేవిడ్ మిల్లర్ 31 పరుగులతో ప్రమాదకరంగా  మారుతున్న సమయంలో చాహల్ ఔట్ చేశాడు.  

అంతకుముందు కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి డుమిని కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చాల్ తన మణికట్టు మాయాజాలంతో దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశాడు. క్రీజులో కుదురుకుని స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్న డుప్లెసిస్( 38 పరుగులు), డుస్సెన్ (22 పరుగులు) లను ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపించాడు. 

ప్రపంచ కప్ టోర్నీలో మొదటి మ్యాచ్ ఆడుతున్న టీమిండియాకు బుమ్రా మంచి శుబారంభాన్ని అందించాడు.మొదట ఆమ్లాను  ఔట్ చేసిన బుమ్రా మరో ఓపెనర్ డికాక్ (10 పరుగులు) ను కూడా పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో కేవలం 24 పరుగుల వద్దే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 

  ప్రపంచ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా టాస్ ఓడిపోయింది. ఇలా టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా టీమిండియా మొదట ఫీల్డింగ్చేయాల్సి వచ్చింది.  

గత మ్యాచ్ లో బంగ్లా చేతిలో ఓటమిని చవిచూసి  తీవ్ర విమర్శలపాలైప సౌతాఫ్రికాకు కాస్త ఊరటనిచ్చే అంశమేంటంటే హషీమ్ ఆమ్లా జట్టులోకి రావడం. మొదటి మ్యాచ్ లో గాయపడిన అతడు బంగ్లాతో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. అంతేకాకుండా  ఆ జట్టులోకి తబ్రయిజ్ షంసీ కూడా కొత్తగా చేరాడు. అలాగే  ఆల్ రౌండర్లు మొర్రిస్, ఫెహ్లుక్వాయోలు కూడా ఈ మ్యాచ్ ఆడనున్నారు. మార్‌క్రమ్ ఒక్కడినే దక్షిణాఫ్రికా పక్కనపెట్టింది.  

ఈ మ్యాచ్ లో ఇద్దరు ఫేసర్లు  భువనేశ్వర్, బుమ్రా లు బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ కోహ్లీ  వెల్లడించాడు. మహ్మద్ షమీ ని పక్కనపెట్టినట్లు తెలిపాడు. అలాగే ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ లకు తుది జట్టులో చోటు దక్కింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కెఎల్  రాహుల్ కు తుది జట్టులో చోటు దక్కగా విజయ్ శంకర్ ను పక్కనబెట్టారు. రాహుల్  కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 

తుది జట్లు:

ఇండియన్ టీం:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కెఎల్ రాహుల్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేందర్ చాహల్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా 

 
సౌతాఫ్రికా టీం:

క్వింటన్ డికాక్ (వికెట్  కీపర్), హషీమ్ ఆమ్లా, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), వాండర్ డుస్సన్, డేవిడ్ మిల్లర్, డుమిని, ఫెహ్లుక్వాయో, క్రిస్ మొర్రిస్, కగిసో రబడ, త్రబయిజ్ షంసీ, ఆమ్రాన్ తాహిర్ 
 

Follow Us:
Download App:
  • android
  • ios