Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: లంకను డుప్లెసిస్, ఆమ్లా ఇద్దరే బాదేశారు... సౌతాఫ్రికా ఘన విజయం

ఇంగ్లాండ్ వేదికగా  జరుగుతున్న ప్రపంచ కప్ లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే కొన్ని జట్లు సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా మరికొన్ని జట్లు ఆ అవకాశం కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. ఇలా నాలుగో స్థానం కోసం పోరాడుతున్న శ్రీలంక జట్టు ఇప్పటికే సెమీస్ అవకాశాన్ని కోల్పోయిన దక్షిణాఫ్రికాతో ఇవాళ(శుక్రవారం) తలపడుతోంది. ఇలా లంక సెమీస్ అవకాశాలను నిర్ణయించడమే కాకుండా మిగతా జట్ల అవకాశాలను ప్రభావితం చేసే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 
 

world cup 2019: south africa vs sri lanka match updates
Author
Chester-le-Street, First Published Jun 28, 2019, 2:56 PM IST

ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక సెమిస్ ఆశలపై సౌతాఫ్రికా నీళ్లు చల్లింది. ఇప్పటికే సఫారీ జట్టు సెమీస్ ఆశలు గళ్లంతవగా తాజా ఓటమితో శ్రీలంక ఆశలు కూడా ఆవిరయ్యాయి.  204 పరుగల  స్వల్ఫ లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేేవలం 37.2 ఓవర్లలోనే 1 వికెట్ నష్టపోయి ఛేధించింది. డికాక్ 15 పరుగులకే ఔటవగా ఆమ్లా 76, కెప్టెన్  డుప్లెసిస్ 92 పరుగులతో అజేయంగా నిలిచి సఫారీ జట్టును విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో మలింగ ఒక్కడికే  ఓ వికెట్ దక్కింది. 

 సౌాతాఫ్రికా బౌలర్ల విజృంభణతో శ్రీలంక జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలింది. 49.3 ఓవర్లలో కేవలం 203 పరుగులు చేసిన లంక ఆలౌటయ్యింది. లంక బ్యాట్ మెన్స్ లో కుషాల్ పెరీరా(30 పరుగులు), అవిష్క ఫెర్నాండో(30 పరుగులు) లు ఇద్దరే టాప్ స్కోరర్లు. మిగతా వారువ్వరూ రాణించకపోవడంతో లంక ఇలా తక్కువ పరుగులకే ఆలౌటయ్యింది. 

ఈ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ ప్రిటోరియస్ చెలరేగిపోతున్నాడు.  పది ఓవర్లు బౌలింగ్ చేసిన ఇతడు కేవలం 25 పరుగులు మాత్రమే సమర్పించుకుని మూడు వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన పది ఓవర్లలో రెండు మెయిడిన్ కావడం విశేషం. ఇక మిగతావారిలో మొర్రిస్ 3, రబడ 2, ఫెహ్లుక్వాయో 1, డుమిని 1  వికెట్ పడగొట్టారు. 

 సెమీస్ అవకాశాలు సజీవంగా వుంచుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో లంక బ్యాాట్ మెన్స్ తడబడ్డారు. కుషాల్ పెరెరా , ఫెర్నాండో లు కేవలం ఐదు పరుగుల తేడాతో ఫ్రిటోరియస్ బౌలింగ్ లో ఔటయ్యారు. ఇలా లంక 67 పరుగుల వద్ద రెండో, 72 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన తర్వాత లంక ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ కు చేరడంతో  లంక 203 పరుగులకే ఆలౌటయ్యింది. 

టాస్ ఓడి మొదట బ్యాాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ కరుణరత్నే పరుగలేమీ సాధించకుండానే డకౌటయ్యాడు. దీంతో కేవలం ఒక్క పరుగు వద్దే లంక మొదటి వికెట్  కోల్పోయింది. 

ఇంగ్లాండ్ వేదికగా  జరుగుతున్న ప్రపంచ కప్ లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే కొన్ని జట్లు సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా మరికొన్ని జట్లు ఆ అవకాశం కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. ఇలా నాలుగో స్థానం కోసం పోరాడుతున్న శ్రీలంక జట్టు ఇప్పటికే సెమీస్ అవకాశాన్ని కోల్పోయిన దక్షిణాఫ్రికాతో ఇవాళ(శుక్రవారం) తలపడుతోంది. ఇలా లంక సెమీస్ అవకాశాలను నిర్ణయించడమే కాకుండా మిగతా జట్ల అవకాశాలను ప్రభావితం చేసే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

ఈమ్యాచ్ కోసం చేపట్టిన టాస్ ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. దీంతో కెప్టెన్ డుప్లెసిస్ మొదట బౌలింగ్ చేయనున్నట్లు ప్రకటించాడు. కాబట్టి  శ్రీలంక మొదట బ్యాటింగ్ కు దిగింది.

సౌతాఫ్రికా జట్టులో రెండు మార్పులు చేపట్టినట్లు కెప్టెన్ డుప్లెసిస్ వెల్లడించాడు. ఎంగిడి, డేవిడ్ మిల్లర్ ల స్థానంలో డ్వెయిన్ ప్రిటోరియస్, డుమిని లు జట్టులో చేరినట్లు తెలిపాడు. శ్రీలంక జట్టు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రధీప్ స్థానంలో సురంగ లక్మల్ కు ఈ మ్యాచ్ అవకాశం కల్పించింది.

తుది  జట్లు:

శ్రీలంక టీం: 

దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుషాల్ పెరెరా(వికెట్ కీపర్), అవిష్కా ఫెర్నాండో, కుషాల్ మెండిస్, ఆంజెలో మాథ్యూస్, జీవన్ మెండిస్,ధనంజయ  డిసిల్వా, తిసార పెరెరా, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, సురంగ లక్మల్ 

సౌతాఫ్రికా టీం:

క్వింటన్ డికాక్(వికెట్  కీపర్), హషీమ్ ఆమ్ల, మార్క్రమ్, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), వాండర్ డుస్సెన్, జెపి డుమిని, ఫెహ్లుక్వాయో, డ్వెయిన్ ప్రిటోరియస్, క్రిస్ మొర్రిస్, కగిసో రబడ, ఇమ్రాన్ తాహిర్ 

Follow Us:
Download App:
  • android
  • ios