Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ 2019: తాహిర్, డికాక్ విజృంభణ... అప్ఘాన్ పై సౌతాఫ్రికా సునాయాస విజయం

ప్రపంచ కప్ టోర్నీలో వరుస ఓటములతో సతమతమవుతున్న సౌతాఫ్రికా ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. పసికూన అప్ఘాన్ పై మొదట బౌలింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ విభాగాల్లో రాాణించడంతో సఫారీ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసి అప్ఘాన్ నిర్దేశించిన 126 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని సఫారీ జట్టు కేవలం 28.4 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి ఛేదించి విజయాన్ని అందుకుంది. ఇందులో డికాక్  68, ఆమ్లా 41 పరుగులతో  ఆకట్టుకున్నారు.  

world cup 2019:  south africa vs afghanistan   match updates
Author
Cardiff, First Published Jun 15, 2019, 5:49 PM IST

ప్రపంచ కప్ టోర్నీలో వరుస ఓటములతో సతమతమవుతున్న సౌతాఫ్రికా ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. పసికూన అప్ఘాన్ పై మొదట బౌలింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ విభాగాల్లో రాాణించడంతో సఫారీ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసి అప్ఘాన్ నిర్దేశించిన 126 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని సఫారీ జట్టు కేవలం 28.4 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి ఛేదించి విజయాన్ని అందుకుంది. ఇందులో డికాక్  68, ఆమ్లా 41 పరుగులతో  ఆకట్టుకున్నారు.  

సఫారీ బౌలర్ల దాటికి బెంబేలెత్తిపోయిన అప్ఘాన్ టీం 125 పరుగులకే చేతులెత్తేసింది. ఓ దశలో  56 పరుగుల వద్ద కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టస్థితిలో వున్న అప్ఘాన్ మరో 70 పరుగుల్లోపే మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ఆరంభంలో హజ్రతుల్లా 22, నూర్ అలీ 32, చివర్లో రషీద్ ఖాన్ 35 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లెవరూ కనీసం రెండంకుల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో అప్ఘాన్ తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సి వచ్చింది. 

అప్ఘాన్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చడంతో తాహిర్ ముఖ్య పాత్ర పోషించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన అతడు కేవలం 29 పరుగులు మాత్రమే సమర్పించుకుని నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక మిగతా బౌలర్లలో మొర్రిస్3, పెహ్లుక్వాయో  2, రబడ  1 వికెట్ పడగొట్టారు.  

వర్షం ఆగిపోయి మ్యాచ్ మొదలైన వెంటనే అప్ఘాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వెంటవెంటనే ఇద్దరు బ్యాట్ మెన్స్ పెవిలియన్ కు చేరడంతో  కష్టాల్లోకి జారుకుంది. నెమ్మదిగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన జద్రాన్ 32 పరుగుల వద్ద తాహిర్ బౌలింగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా షాహిది 8, అస్ఘర్ అప్ఘాన్ 0, మహ్మద్ నబీ 1 పరుగు  మాత్రమే చేసి ఔటయ్యారు. దీంతో 56 పరుగుల వద్ద కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టస్థితిలో నిలిచిన  అప్ఘాన్ 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

కార్డిఫ్ లో మరోసారి వర్షం మొదలయ్యింది. దీంతో అప్ఘాన్-సౌతాఫ్రికా ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రెండోసారి నిలిచిపోయింది. అప్ఘాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగుల వద్ద వుండగా వర్షం అడ్డుకుంది. 

అప్ఘానిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. సఫారీ  బౌలర్ మొర్రిస్ బౌలింగ్ లో రహ్మత్ షా వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీ గా ఔటయ్యాడు. దీంతో అప్ఘాన్ 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

సౌతాఫ్రికాతో బౌలర్ రబడ అప్ఘాన్ కు మొదటి షాకిచ్చాడు.  వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న అప్ఘాన్ ఓపెనింగ్ జోడిని అతడు విడదీశాడు. నిలకడగా ఆడుతూనే ప్రమాదకరంగా మారుతున్న హజ్రతుల్లా (22 పరుగులు 23 బంతుల్లో) రబడ బౌలింగ్ లో ఔటయ్యాడు.  దీంతో అప్ఘాన్ 39 పరుగుల  వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 

సౌతాఫ్రికి-అప్ఘానిస్తాన్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అప్ఘాన్ 5.5 ఓవర్లలో వికెట్లేవీ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఈ సమయంలో ఒక్కసారిగా జోరున వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. 

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ(శనివారం) సౌతాఫ్రికా- అప్ఘానిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. కొద్దిసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అప్ఘాన్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. 

తుది జట్లు:

దక్షిణాఫ్రికా టీం:

క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, మార్క్రమ్, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), వాండర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వాయో, క్రిస్ మొర్రిస్, కగిసో రబాడ, హెండ్రిక్స్, ఇమ్రాన్ తాహిర్ 

అప్ఘాన్ టీం:

హజ్రతుల్లా, నూర్ అలీ జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, అస్ఘార్ అప్ఘాన్, గుల్బదిన్ నయిబ్(కెప్టెన్), మహ్మద్ నబీ, ఇక్రమ్(వికెట్ కీపర్), రషీద్ ఖాన్, అప్తాబ్ ఆలమ్, హమిద్ హసన్ 
 

Follow Us:
Download App:
  • android
  • ios