ప్రపంచ కప్ లీగ్ దశలో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ ఘన విజయం సాధించింది. అది కూడా 94 పరుగుల భారీ తేడాతో బంగ్లను ఓడించి. అయినా ఫలితం లేకుండా పోయింది. న్యూజిలాండ్ కంటే ఎక్కువ రన్ రేట్ పొందాలంటే దాదాపు 300 పైచిలుకు పరుగులతో గెలవాల్సిన పాక్ 94 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. దీంతో కివీస్ సెమిస్ కు అర్హత సాధించగా పాక్ నిరాశతో ఇంటిదారి పట్టాల్సివస్తోంది. 

ఈ మ్యాచ్ పాక్ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఏ దశలోనూ బంగ్లా ఇన్నింగ్స్ సాగలేదు. ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోతూ ఆ జట్టు కష్టాల్లోకి జారుకుంది. అయితే షకీబ్ అల్ హసన్ (64 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా జట్టుకు విజయాన్ని అందించేస్థాయి ఆటతీరు ప్రదర్శించలేదు. ఇక మిగతావారిలో లిటన్ దాస్ 32, మహ్మదుల్లా 29, సౌమ్యా సర్కార్ 22 మాత్రమే టాప్ స్కోరర్స్. దీంతో బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. 

పాక్ బౌలర్లలో షాహిాన్ షా అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక షాదన్ ఖాన్ 2,అమీర్ , రియాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఇలా పాక్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా 221 పరుగులకే పరిమితమయ్యింది. 

 ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ కు చేరాలన్న పాకిస్థాన్ కల నెరవేరలేదు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో  పాక్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 315 పరుగులు చేయగలిగింది. దీంతో బంగ్లాను కేవలం 8 పరుగులకే ఆలౌట్ చేయగలిగితే రన్ రేట్ ఆధారంగా సెమీస్ కు చేరే అవకాశముంది. అలా జరగడం అసాధ్యం కావున పాక్ సెమీస్ ఆశలు ఇక గళ్లంతయ్యాయి.

పాకిస్థాన్ ఆదిలోనే ఓపెనర్ ఫకార్ వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ ఇమామ్ అద్భుతంగా ఆడాడు.బాబర్ ఆజమ్,ఇమామ్ లు కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇమామ్ తన సెంచరీని పూర్తి చేసుకోగా బాబర్ మాత్రం సెంచరీ  చేయలేకపోయాడు. మరో నాలుగు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందనగా బాబర్ (96 పరుగుల)ను సైఫుద్దిన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 

ఇలా ఇమామ్, బాబర్ లు ఔటయిన తర్వాత పాక్ జట్టు టపటపా వికెట్లు కోల్పోయింది. ఇమద్ వసీం ఒక్కడే 23 బంతుల్లో 43 పరుగులు కాస్సేపు మెరుపులు మెరిమించడంతో పాక్ 315 పరుగులు చేయగలిగింది. 

బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మరోసారి ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఇక మిగతా బౌలర్లలో సైఫుద్దిన్ 3, మీరజ్ 1 వికెట్ పడగొట్టాడు. 

ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్డ్ హర్ట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. నాన్ స్ట్రైకర్ ఎండు లో వున్న అతడు ఇమద్ వసీం బాదిన ఓ స్ట్రైట్ షాట్ కు గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడిపోయిన అతడు సహాయక సిబ్బంది సాయంతో పెవిలియన్ కు చేరాడు. 

255 పరుగుల వద్ద పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. గత మ్యాచుల్లో తన అద్భుత  బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన హరీస్ సోహైల్ బంగ్లా బౌలర్లను మాత్రం ఎదుర్కోలేకపోయాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన ఔటయ్యాడు.

భారీ పరుగుల దిశగా ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో పాక్ కీలకమైన రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. సెంచరీతో అదరగొట్టిన ఇమామ్(100 పరుగులు) ను ముస్తాఫిజుర్ రహ్మాన్, హఫీజ్(27 పరుగులు) ను హసన్ మీరజ్ ఔట్ చేశాడు. 

 అద్భుతమైన బ్యాటింగ్ అదరగొడుతూ సెంచరీకి చేరువైన బాబర్ ఆజమ్ (96 పరుగులు) నుసైఫుద్దిన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో  సెంచరీకి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆజమ్ ఇన్నింగ్స్ ముగిసింది.  

బంగ్లాదేశ్ తో జరుగుతున్న కీలకమ్యాచ్ లో పాక్ ఆదిలోనే ఓపెనర్ ఫకార్ జమాన్ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు కేవలం 23 వద్ద వున్నపుడే ఫకార్(13 పరుగులు) ను బంగ్లా బౌలర్ సైఫుద్దిన్ ఔట్ చేశాడు. 

ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోని లార్డ్స్ మైదానం మరో రసవత్తర మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ కు చేరాలని ఉవ్విళ్లూరుతున్న మన దాయాది పాకిస్థాన్ మరో ఉపఖండ జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది. ఈ మ్యాచ్ 300 పైచిలుకు పరుగుల తేడాతో గెలిస్తే తప్ప పాక్ సెమీస్ కు చేరే అవకాశాలు లేవు. అలాగని ఆ జట్టుకు ఇది తప్ప మరో మార్గం లేదు. కాబట్టి పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో ఏం చేస్తుంది...ఎలా ఆడుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

అయితే బంగ్లాదేశ్ ఇప్పడికే సెమీస్ అవకాశాలను కోల్పోయింది. అయితే ఈ టోర్నీలో పలు సంచలన విజయాలు అందుకుని సత్తాచాటిన ఈ జట్టు చివరి మ్యాచ్ ను కూడా విజయంతో ముగించాలని చూస్తోంది. 

ఇక మరికొద్దిసేపట్లో మొదలవనున్న ఈ మ్యాచ్ కోసం చేపట్టిన టాస్ ను పాకిస్థాన్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్  ఎంచుకున్నాడు. కాబట్టి బంగ్లా మొదటి  బౌలింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్ కు దిగనుంది.   

తుది జట్లు:

పాకిస్థాన్:

ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్, మహ్మద్  హఫీజ్, హరీస్ సోహైల్, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్&వికెట్ కీపర్), ఇమద్ వసీం, షాదన్ ఖాన్, మహ్మద్ అమీర్, వాహబ్ రియాజ్, షాహిన్ అఫ్రిది. 

బంగ్లాదేశ్:

తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్పికర్ రహీమ్(వికెట్ కీపర్), లిటన్ దాస్, మహ్మదుల్లా, మొసద్దిక్ హుస్సెన్, మెహిది హసన్ మీరజ్, మహ్మద్ సైఫుద్దిన్, ముష్రఫే మోర్తజా(కెప్టెన్), ముస్తాఫిజుర్ రహ్మాన్