ఆస్ట్రేలియా  చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కేవలం 266 పరుగుల వద్దే ఆలౌటయ్యింది. పాక్ ఓపెనర్ ఇమామ్ 53, హఫీజ్ 46, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 40, హసన్ అలీ 302, వాహబ్ రియాబ్ 45, బాబబర్ ఆజమ్ 30 పరుగులతో రాణించినా  ఫలితం లేకుండా పోయింది. పాక్ ముందు భారీ లక్ష్యం వుండటంతో ఒత్తిడికి లోనైన బ్యాట్ మెన్స్ వేగంగా పరుగులు సాధించడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. 

ఇక ఆసిస్ బౌలింగ్ విషయానికి వస్తే కమ్మిన్స్ అద్భుతంగా రాణించి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి నిమిషంలో స్టార్క్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆసిస్ గెలుపును ఖాయం చేశాడు. మిగతావారిలో రిచర్డ్ సన్ 2, కుల్టర్ నైల్, ఫించ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ నెలకొల్పిన వాహబ్ రియాజ్ ఔటవడంతో పాక్ ఓటమి ఖాయమయ్యింది. కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగి వేగంగా 45 పరుగులు సాధించిన రియాజ్ ను స్టార్క్ ఔట్ చేశాడు.ఆ వెంటనే అదే ఓవర్లో అమీర్ డకౌటయ్యాడ. ఈ ఓవరే పాక్ కొంప ముంచిందని చెప్పాలి. చివరకు సర్ఫరాజ్ రనౌట్ అవడంతో ఆసిస్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.

పాకిస్థాన్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 200 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. అంతకుముందు ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మిస్తూ.. జట్టును గెలుపు దిశగా తీసుకెళ్తున్న ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఔటయ్యాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి అర్థసెంచరీ పూర్తి చేసుకున్న ఇమామ్.. 53 పరుగుల వద్ద ఆ తర్వాతి బంతికే వికెట్ కీపర్ అలెక్స్ కారెకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

పాకిస్థాన్ 56 పరుగులకే రెెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ఫకార్ జమాన్ కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేక డకౌట్ అయ్యాడు. కమ్మిన్స్ బౌలింగ్ లో రిచర్డ్ సన్ కు క్యాచ్ ఇచ్చి అతడు ఔటయ్యాడు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ 30 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.  

ఆరంభంలో ఆకట్టుకోలేకపోయినా పాక్ బౌలర్లు చివర్లో అద్భుత ప్రదర్శన చేశారు. ఓపెనర్లు ఫించ్, వార్నర్ విజృంభణతో భారీ స్కోరు సాధించేలా కనిపించిన పాక్ ను 307 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా ఆసిస్ మిడిల్ ఆర్డర్, టెయిలెండర్లను కట్టడిచేయడంతో పాక్ సఫలమయ్యింది. వార్నర్ (107 పరుగులు), ఫించ్ (82 పరుగులు) మినహాయిస్తే మిగతా బ్యాట్ మెన్స్ ఎవ్వరు రాణించలేకపోయారు. టెయిలెండర్లయితే టపటపా వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో ఆసిస్ పాక్ ముందు భారీ లక్ష్యాన్ని వుంచుతుందనుకుంటే కేవలం 308 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది.

పాక్ బౌలర్లలో అమీర్ చెలరేగాడు. అతడే ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి చేజారిపోయిన మ్యాచ్ ను పాక్ ఆదీనంలోకి తీసుకురాగలిగాడు. ఇక మిగతావారితో అఫ్రిది 2, హసన్ అలీ, వాాహబ్ రియాజ్, హఫీజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

 పాక్ పై చెలరేగి సెంచరీ( 111 బంతుల్లో 107 పరుగులు) సాధించిన ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అఫ్రిది బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఇమామ్ చేతికి చిక్కాడు. దీంతో 242 పరుగుల వద్ద అతడు నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.

 పాకిస్థాన్ బౌలర్లను ఆసిస్ ఓపెనర్లు ఉతికి ఆరేశారు. వీరిద్దరే 143 పరుగుల భాగస్వామన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఆరోన్ ఫించ్ 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మహ్మద్ అమీర్ బౌలింగ్ లో ఔటవడంతో ఈ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

ఐసిసి ప్రపంచ కప్ లో మరో రసవత్తర పోరు జరిగింది. భారత్ చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లాండ్  ను ఓడించి  మంచి ఊపుమీదున్న పాకిస్థాన్ జట్లు ఇవాళ తలపడ్డాయి. ఇండియా చేతిలో ఓడిన కసితో ఆడిన ఆసిస్ పాక్ ను చిత్తు చేసింది.  

టౌన్టన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను పాక్ గెలిచింది. దీంతో కెప్టెన్ సర్ఫరాజ్ మరోమాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టే ముందుగా బ్యాటింగ్ కు దిగింది.

తుది జట్లు:

ఆస్ట్రేలియా టీం:

డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), నాథన్ కుల్టర్ నైల్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్ సన్

పాకిస్థాన్ టీం:

ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్,  బాబర్ ఆజమ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్&వికెట్ కీపర్), షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, వాహబ్ రియాజ్,హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, మహ్మద్ అమీర్