Asianet News TeluguAsianet News Telugu

పాక్ సెమీస్ ఆశలు సజీవం... లక్ష్యఛేదనలో అదరగొట్టిన సోహైల్, బాబర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుకు  పాక్ షాకిచ్చింది. సెమీస్  ఆశలు సజీవంగా వుంచుకోవాలంటూ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్  ఇలా అన్ని విభాగాల్లో రాణించి ప్రపంచ కప్ టోర్నీలో మరో విజయాన్ని అందుకుంది. 

world cup 2019: pakistan new zealand match updates
Author
Birmingham, First Published Jun 26, 2019, 2:57 PM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుకు  పాక్ షాకిచ్చింది. సెమీస్  ఆశలు సజీవంగా వుంచుకోవాలంటూ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్  ఇలా అన్ని విభాగాల్లో రాణించి ప్రపంచ కప్ టోర్నీలో మరో విజయాన్ని అందుకుంది. 

కివీస్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో ఐు బంతులు మిగిలుండగానే చేధించింది. బాబర్ ఆజమ్ వీరోచిత సెంచరీకి(127 బంతుల్లో 101 పరుగులు నాటౌట్) హరీస్ సోహైల్ (68 పరుగులు) హాప్ సెంచరీ తోడవడంతో అలవోకగా లక్ష్యచేధన సాగింది.మహ్మద్ హాఫీజ్ కూడా 32 పరుగులతో పరవాలేదనిపించాడు. కానీ ఓపెనర్లే వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన నిరాశపర్చారు.

స్వల్ఫ లక్ష్యాన్ని ఛేదించకుండా పాక్ ను అడ్డుకోవడంలో కీవీస్ బౌలర్లు విఫలమయ్యారు. ఫెర్గ్ సన్, బోల్ట్, విలియమ్సన్ లు తలో వికెట్ పడగొట్టినా  ఫలితం  లేకుండా పోయింది. ముఖ్యంగా బాబర్ ఆజమ్, సోహైల్ ల జోడిని విడదీయడంలో విఫలమవడంతో కివీస్ ఓటమి ఖాయమయ్యింది.

పాకిస్థాన్ మూడో  వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలర్ ఫెర్గ్ సన్ బౌలింగ్ లో మహ్మద్ హఫీజ్(32 పరుగులు) ఔటయ్యాడు. దీంతో పాక్ 110 పరుగుల వద్ద మూడోో వికెట్ కోల్పోయింది. అయితే మరోవైపు బాబర్ ఆజమ్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీతో పాక్ ను విజయం వైపు నడిపిస్తున్నాడు.  

దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఔటయ్యాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్న ఇమామ్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫెర్గుసన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్న ఓపెనర్ ఫఖర్ జమాన్‌ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్ట్ బౌలింగ్‌లో గప్టిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

చావో రేవో అన్నట్లు సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్.. పాకిస్తాన్ ముందు 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్తాన్ పేస్ ధాటికి కివీస్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలింది. 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ విలియమ్సన్.. నీషమ్‌తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.

ఆ తర్వాత విలియమ్సన్‌ కూడా నిష్క్రమించడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో నీషమ్-గ్రాండ్ హోమ్మీల జోడి పాక్ బౌలర్లను ఎదుర్కొంది. ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వీరిద్దరి ఆటతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.  నీషమ్ 91 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాహీన్ 3, అమీర్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. 

కీలక దశలో న్యూజిలాండ్ వికెట్ కోల్పోయింది. చివరి ఓవర్లలో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన గ్రాండ్ హోమ్మీ 64 పరుగుల వద్ద రన్ ఔట్ అయ్యాడు. ఇతను నీషమ్‌తో కలిసి 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

గ్రాండ్ హోమ్ అర్థసెంచరీ చేశాడు. చివరి ఓవర్లలో నీషమ్‌కు అండగా నిలిచిన అతను  63 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 

నీషమ్ అర్థ సెంచరీ సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ విలయమ్సన్‌కు అండగా నిలిచి ఆచితూచి ఆడిన నీషమ్.. 77 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

న్యూజిలాండ్ కీలక వికెట్ కోల్పోయింది. పాక్ పేస్ ధాటిని తట్టుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు శ్రమించిన కెప్టెన్ విలియమ్సన్‌ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కివీస్ మరిన్ని కష్టాల్లోకి వెళ్లింది. 

న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పాక్ బౌలింగ్ ధాటికి కీవీస్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. 1 పరుగు చేసిన టామ్ లోథమ్.. షాహీన్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కెప్టెన్ విలియమ్సన్‌పైనే కీవీస్ ఆశలు పెట్టుకుంది. 

పాక్ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్.. అనుభవజ్ఞుడు రాస్ టేలర్ వికెట్‌ను కోల్పోయింది. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాహీన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కి క్యాచ్ ఇచ్చి టేలర్ పెవిలియన్ చేరాడు. 

న్యూజిలాండ్ స్వల్ప వ్యవధిలో రెండో వికెట్ కోల్పోయింది. పాక్ బౌలర్లు పదునైన బౌలింగ్‌తో విజృంభిస్తుండటంతో కీవీస్ బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయడం కష్టంగా మారింది. ఓపెనర్ మున్రో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో సోహైల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

న్యూజిలాండ్ ఆదిలోనే తడబడింది. ఫోర్ కొట్టి మంచి ఊపు మీదున్న ఓపెనర్ గుప్టిల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమీర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కీవీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న న్యూజిలాండ్ జోరును కొనసాగించాలని చూస్తుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. 

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో మరో రసవత్తర పోరుకు బర్మింగ్ హామ్ స్టేడియం సిద్దమైంది. వరుస విజయాలతో దూసుకుపోతూ సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న న్యూజిలాండ్ తో పాకిస్థాన్ తలపడనుంది. సెమిఫైనల్ అవకాశాలను సజీవంగా వుంచుకోవాలంటే పాక్ ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. దీంతో  ఆ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.  

అయితే  బర్మింగ్ హామ్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశాలున్నాయి. వర్షం మరోసారి ప్రపంచ కప్  టోర్నీని ఇబ్బంది పెడుతోంది.  టాస్ కు కూడా వాతావరణం అనుకూలించకడం లేదు. దీంతో కొద్దిసేపటి తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించిన తర్వాత మ్యాచ్ పై నిర్ణయం తీసుకోనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios