ప్రపంచ కప్ టోర్నీలో మరో లోస్కోరింగ్ మ్యాచ్ కు కార్డిప్ స్టేడియం వేదికయ్యింది. శ్రీలంక నిర్దేశించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్లు అద్భుతంగా రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. గప్తిల్(63 పరుగులు 47 బంతుల్లో), మన్రో( 57 పరుగులు 46 బంతుల్లో) లంక బౌలర్లను వీరబాదుడు బాది వికెట్లేమ నష్టపోకుండా కివీస్ ను విజయతీరాలకు చేర్చారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక మొదటినుండి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. కివీస్ బౌలర్లు ఏ దశలోనూ ఆ జట్టును కోలుకోనివ్వకుంండా విరామం లేకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో కేవలం 136 పరుగుల స్వల్ఫ స్కోరుకే లంక జట్టు కుప్పకూలిపోయింది. శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె ఒక్కడే 52  పరుగులతో చివరి వరకు నాటౌట్ గా నిలిచి పోరాడాడు. అతడి హాఫ్ సెంచరీ వల్లే శ్రీలంక జట్టు కనీసం 137 పరుగుల లక్ష్యాన్నయినా కివీస్ ముందు వుంచగలిగింది. కివీస్ బౌలర్లు ఫెర్గ్ సన్ 3, హెన్రీ 3, బోల్ట్, గ్రాండ్ హోమ్, నీషమ్, సాట్నర్ తలో వికెట్ పడగొట్టారు. 

ఓ వైపు వరుసగా వికెట్లు కూలుతున్న శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే బ్యాటింగ్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఇలా సమయోచింగా ఆడుతూ  52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. లోయర్ ఆర్డర్ తో కలిసి తన పోరాటాన్ని కొనసాగించి శ్రీలంకకు కాస్త గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కివీస్ బౌలర్ల దాటికి బ్యాట్ మెన్స్ అందరు విఫలమవుతున్న వేళ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే కాస్సేపు కెప్టెన్ కు అండగా నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్న పెరీరా సాట్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ వెంటనే నీషమ్ బౌలింగ్ లో ఉదన డకౌటయ్యాడు.దీంతో లంక 114 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

న్యూజిలాండ్ బౌలర్ల దాటికి శ్రీలంక టాప్ ఆర్డర్ కుప్పకూలింది. హెన్రీ, ఫెర్గ్ సన్ లకు తాజాగా గ్రాండ్ హోమ్ తోడవడంతో లంక బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోతున్నారు. గ్రాండ్ హోమ్ బౌలింగ్ లో మ్యాథూస్ డకౌటవగా ఆ వెంటనే మెండిస్ ను కేవలం ఒక్క పరుగు వద్దే ఫెర్గ్ సన్ పెవిలియన్ కు పంపించాడు. దీంతో లంక టాఫ్ ఆర్డర్ మొత్తం కేవలం 60 పరుగులకే చేతులెత్తేసింది.  

 న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ బంతితో చెలరేగుతున్నాడు. అతడు ఓకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పై కోలుకోలేని  దెబ్బ తీశాడు. దాటిగా ఆడుతున్న పెరీరా (29 పరుగులు) ను ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించగా ఆ వెంటనే మెండిస్ ను కూడా డకౌట్ చేశాడు. 

 ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇవాళ(శనివారం) శ్రీలంక-  న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందుకోసం కొద్దిసేపటి క్రితమే నిర్వహించిన టాస్ ను కివీస్ జట్టు గెలుచుకుని మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

తుది జట్లు:

కివీస్ టీం:

మార్టిన్ గప్తిల్, కోలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టిమ్ లాథమ్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కోలిన్ డి  గ్రాండ్ హోమ్, మిచెల్ సాట్నర్, హెన్రీ, ఫెర్గుసన్, ట్రెంట్ బోల్ట్

శ్రీలంక టీం:

దిముత్ కరుణరత్నే(కెప్టెన్), తిరుమన్నె, కుశాల్ పెరీర(వికెట్ కీపర్), కుశాల్ మెండిస్, ఆంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, జీవన్ మెండిస్, థిసారా పెరీరా, ఇసురు ఉదన, సురంగ లక్మల్, లసిత్ మలింగ