Asianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: విలియమ్సన్ అద్భుత సెంచరీతో కివీస్ గెలుపు ... పోరాడి ఓడిన సౌతాఫ్రికా

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బర్మింగ్ హామ్ లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది.  చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు సౌతాఫ్రికాకు మరో ఓటమి తప్పలేదు. ఇలా ప్రపంచ కప్ 2019 టోర్నీలో  ఇప్పటివరకు బోణీ కొట్టలేకపోయింది. ఇక పాయింట్ టేబుల్ లో టాప్ లో నిలిచిన కివీస్ మరో విజయంతో మరింత మేరుగైన స్థానానికి చేరుకుంది. 

world cup 2019: new zealand vs south africa match updates
Author
Birmingham, First Published Jun 19, 2019, 2:54 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బర్మింగ్ హామ్ లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది.  చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు సౌతాఫ్రికాకు మరో ఓటమి తప్పలేదు. ఇలా ప్రపంచ కప్ 2019 టోర్నీలో  ఇప్పటివరకు బోణీ కొట్టలేకపోయింది. ఇక పాయింట్ టేబుల్ లో టాప్ లో నిలిచిన కివీస్ మరో విజయంతో మరింత మేరుగైన స్థానానికి చేరుకుంది. 

242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి  బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఆదిలోనే వికెట్  కోల్పోయింది. సఫారీ బౌలర్ రబడ బౌలింగ్ స్ట్రెయిట్ గా బౌండరీ బాదడానికి ప్రయత్నించిన మన్రో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కివీస్ 9 పరుగుల వద్దే  మొదటి వికెట్ కోల్పోయింది. అయితే మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆడినా వెంటవెంటన మూడు వికెట్లు పడటంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. నిలకడగా ఆడుతూ  (32 పరుగులు) స్కోరు వేగాన్ని మెల్లిగా పెంచుతున్న గప్తిల్ ను (32 పరుగులు)  పెహ్లు క్వాయో ఔట్ చేశాడు. ఆ తర్వాాత మొర్రిస్ రెచ్చిపోయి తన వరుస ఓవర్లలో టేలర్, లాథమ్ లను పెవిలియన్ కు పంపించాడు. దీంతో వన్ సైడెడ్ గా సాగుతుందనుకున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది.

ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ ఓ వైపు వికెట్లు పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజుకు అంటుకుపోయి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోని అతడి సెంచరీ (138 బంతుల్లో 106 పరుగులు) గ్రాండ్ హోమ్( 40బంతుల్లో 60 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో కివీస్ విజయతీరాలకు చేరింది. మరో మూడు  బంతులుండగానే కివీస్ విజయాన్ని అందుకోగా సఫారి జట్టుకు మరో ఓటమి తప్పలేదు. 

సౌతాఫ్రికా బౌలర్లలో మొర్రిస్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అతడితో పాటు రబడ, ఎంగిడి, ఫెహ్లుక్వామోలు తలో  వికెట్ తీసి విండీస్ తో పోరాడారు. అయితే కాపాడుకోవాల్సిన పరుగులు తక్కువగా వుండటంతో వారుకూడా ఏం చేయలేకపోయారు.

 ఇక ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో సౌాతాఫ్రికా తడబాటు కొనసాగుతోంది. ఇవాళ బర్మింగ్ హామ్ వేదికన కివీస్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆ జట్టు బ్యాట్ మెన్స్ రాణించలేకపోయారు. అందరు కాస్తో కూస్తో పరుగులు చేసిన  ఒక్కరు కూడా భారీ స్కోర్లు సాధించలేకపోయారు. ఆమ్లా హాఫ్ సెంచరీ (55 పరుగులు), మర్క్రమ్ 38, మిల్లర్ 36 పరుగులు చేశారు. ఇక డుస్సెన్ ఒక్కడే చివరి వనకు నిలిచి 67 పరుగులు చేయడంతొ కివీస్ 241 పరుగులయినా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో ఫెర్గ్ సన్ 3 వికెట్లు పడగొట్టగా, సాట్నర్, గ్రాండ్ హోమ్, బౌల్ట్ ఒక్కో వికెట్ పడగొట్టాడు.  

దక్షిణాఫ్రికా-కివీస్ మ్యాచ్ వర్షం  కారణంగా  కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కోసం కొద్దిసేపటికే నిర్వహించిన టాస్ ను కివీస్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ విలియమ్సన్ మొదట ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపాడు. దీంతో సౌతాఫ్రికాకు మొదట  బ్యాటింగ్ రూపంలో మరో కఠిర పరీక్ష ఎదురవనుంది.  

తుది జట్లు:

సౌతాఫ్రికా టీం: 

హషీమ్ ఆమ్లా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), మార్క్రమ్, ఫాఫ్  డుప్లెసిస్ (కెప్టెన్), వాండర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వాయో,  క్రిస్ మొర్రిస్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్ 

న్యూజిలాండ్ టీం:

మార్టిన్ గప్తిల్, కోలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లూథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్,  గ్రాండ్ హోమ్, మిచెల్ సాట్నర్, మాట్ హెన్రీ, ఫెర్గ్ సన్, ట్రెంట్ బౌల్ట్

ప్రపంచ కప్ టోర్నీలో మరో మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది.  బర్మింగ్  హామ్ లో ఉదయం నుండి కురిసిన భారీ వర్షానికి మైదానంలో నీరు నిలిచిపోయింది. దీంతో ఇక్కడ దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్త ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షం ఆగిపోయిన పిచ్ ను సిద్దం సిద్దం చేసే పనిలో గ్రౌండ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. 

కొద్దిసేపట్లో అంపైర్లు పిచ్ ను పరిశీలించి ఆటకు అనుకూలంగా  వుందో లేదో చెబుతారు.  ఆ తర్వాత టాస్ నిర్వహించనున్నారు. అయితే పిచ్ ఆటకు అనుకూలంగా లేకపోతే అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.   

ఇంగ్లాండ్ లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రపంచ కప్ టోర్నీకి తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి.  ఇప్పటికే చాలా మ్యాచులకు వరుణుడు అంతరాయం కలగించి ఇబ్బందిపెట్టడా మరికొన్ని మ్యాచులయితే ఏకంగా రద్దయిపోయాయి. తాజాగా మరోసారి ఈ వర్షం సౌతాఫ్రికా-కివీస్ మ్యాచ్ కు అడ్డు  తగిలింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios