ప్రపంచ కప్ టోర్నీలో మరో సంచలన విజయాన్ని సాధించడానికి బంగ్లాదేశ్ శాయశక్తులా పోరాడి ఓడిపోయింది. లండన్ వేదికగా  జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు బంగ్లా నిర్దేశించిన 245 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 47 వ ఓవర్లో  న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది.. బంగ్లా మరో 20-30 పరుగులు అదనంగా చేసి వుంటే మరో సంచలన విజయం సాధ్యమయ్యేది. 

స్వల్ఫ  లక్ష్యాన్న ఛేధించేందకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును రాస్ టేలర్ ఆదుకున్నాడు. అతడు 91 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. టేలర్ కు కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (40 పరుగులు) చక్కటి సహకారం అందించాడు. అయితే  వీరు ఔటైన తర్వాత కివీస్ బ్యాట్ మెన్స్ ఎవరూ రాణించకపోయినా సాధించాల్సిన లక్ష్యం తక్కువగా వుండటంతో  కిందామీదా పడుతూ విజయాన్ని అందుకుంది. 

అంతకు ముందు మొదట  బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 244 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. బంగ్లా బ్యాట్ మెన్స్ లో షకిబుల్ హసన్ ఒక్కడే 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్ మెన్స్ కూడా రెండంకెల స్కోరు సాాధించినా దాన్ని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.. దీంతో ఆరంభంలో భారీ స్కోరు సాధించేలా కనిపించిన బంగ్లా తక్కువ పరుగులకే ఆలౌట్ కావాల్సి వచ్చింది. కివీస్ బౌలర్లలో హెన్రీ 4,బౌల్ట్ 2,ఫెర్గ్ సన్ , గ్రాండ్ హోమ్,సాట్నర్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

 షకీబల్ హసన్ హాఫ్ సెంచరీ తర్వాత మరింత వేగంగా పరుగులు సాధించడానికి ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు గ్రాండ్ హోమ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

 హాఫ్ సెంచరీ భాగస్వామ్యానికి చేరువైన సమయంలో బంగ్లా ఓపెనింగ్ జోడి విడిపోయింది. మొదట టీం స్కోరు 45 వద్ద వుండగా సౌమ్య సర్కార్(25 పరుగులు) హెన్రీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత  మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(24 పరుగులు) జట్టు స్కోరు 60 వద్ద వుండగా ఫెర్గ్ సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

ప్రపంచ కప్ మెగా టోర్నీలో మరో రసవత్తర సమరానికి లండన్ వేదికయ్యింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లు తలపడున్న ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  ఇందుకు కారణం గత మ్యాచ్ లో బంగ్లా సౌతాఫ్రికాను ఓడించి సంచలన విజయాన్ని అందుకోవడమే. ఇలా బలమైన  జట్టును ఓడించిన బంగ్లా తాము పసికూనలం కాదని నిరూపించుకుని పెద్ద జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది.  

అయితే న్యూజిలాండ్ కూడా గత మ్యాచ్ లో శ్రీలంకను చిత్తుగా ఓడించి మంచి ఊపుమీదుంది. ఇలా  ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా  బరిలోకి దిగుడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. 

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన టాస్ ను గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొదట  బ్యాటింగ్ కు దిగింది. 
 
తుది జట్లు: 

బంగ్లాదేశ్‌ టీం;

మష్రాఫ్‌ మొర్తజా(కెప్టెన్)‌, తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకీబుల్‌ హసన్‌, ముష్పికర్‌ రహీమ్‌, మహ్మద్‌ మిథున్‌, మహ్మదుల్లా, మొసదిక్‌ హుస్సేన్‌, మెహిది హసన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌

న్యూజిలాండ్‌ టీం:

కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్‌, కోలిన్‌ మున్రో, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ సాంత్నార్‌, మ్యాట్‌ హెన్నీ, ఫెర్గ్ సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌