ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో న్యూజిలాండ్ మరో ఘన విజయాన్ని అందుకుంది. అప్ఘానిస్తాన్  జట్టును కివీస్ మొదట అద్భుతమై బౌలింగ్ ప్రదర్శనతో దెబ్బతీసి అతి తక్కువ పరుగుల(172)కే పరిమితం చేసింది. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్ 79, టేలర్ 48పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ కేవలం  32 ఓవర్లలోనే  మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పసికూన అప్ఘాన్ పై కివీస్ బౌలర్లు నీషమ్ ,ఫెర్గ్ సన్ నిప్పులు చెరిగారు. కేవలం వీరిద్దరు కలిసే మొత్తం 9 వికెట్లను పడగొట్టి అప్ఘాన్ జట్టును కుప్పకూల్చారు. దీంతో కేవలం 172 పరుగులకే అప్ఘాన్ ఆలౌటయ్యింది. నీషమ్ 5, ఫెర్గ్ సన్ 4, గ్రాండ్ హోమ్ 1 వికెట్ పడగొట్టారు. అప్ఘాన్ బ్యాట్ మెన్స్ లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయి( 28 బంతుల్లో 34 పరుగులు), నూర్ అలీ జద్రాన్( 38 బంతుల్లో 31 పరుగులు), షాహిది( 59 పరుగులు), అప్తాబ్ ఆలమ్ (14 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు  చేయగలిగారు. మిగతా బ్యాట్ మెన్స్ కనీసం సింగిల్ డిజిట్ స్కోరును కూడా సాధించడంతో  విఫలమయ్యారు. 

వర్షం కారణంగా అప్ఘాన్, కివీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆగిపోయింది. మొదట బ్యాటింగ్ కు దిగిన అప్ఘాన్ 22.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్ద వున్నపుడు వర్షం మొదలయ్యింది. దీంతో అంపైర్లు వెంటనే మ్యాచ్ ను నిలిపేశారు. 

న్యూజిలాండ్ బౌలర్ల దాటికి  అప్ఘాన్ టాప్ ఆర్డర్ విలవిల్లాడిపోతోంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయి( 28 బంతుల్లో 34 పరుగులు), నూర్ అలీ జద్రాన్( 38 బంతుల్లో 31 పరుగులు) రాణించడంతో శుభారంభం లభించింది. అయితే జట్టు స్కోరు 61 పరుగుల వద్ద వుండగా  జజాయి ఔటయ్యాడు. దాంతో వికెట్ల పతనం మొదలయ్యింది. ఆ తర్వాత రహ్మత్ షా డకౌటవగా కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఇలా కేవలం 66 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన అప్ఘాన్ 70 పరుగులకు చేరుకునేసరికి ఆ వికెట్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. కివీస్ బౌలర్ నీషమ్ 3 వికెట్లు, ఫెర్గ్ సన్ 1  వికెట్ పడగొట్టారు.  

ఐసిసి ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ(శనివారం) టౌన్టన్ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్, అప్ఘానిస్తాన్ లు తలపడనున్నాయి. ఇందుకోసం చేపట్టిన టాస్ ను గెలుచుకున్న కివీస్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అప్ఘాన్ మొదట బ్యాటింగ్ కు  దిగనుంది. 

తుది జట్లు:
 
ఆఫ్గనిస్థాన్ టీం: 

హజ్రతుల్లా జజయ్, నూర్ అలీ జద్రాన్, రహ్మత్ షా,  హష్మతుల్లా షాహిది, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, ఇక్రం అలిఖిల్ (వికెట్ కీపర్),
రషీద్ ఖాన్, అఫ్తాబ్ ఆలం, హమీద్ హసన్.
 
న్యూజిలాండ్ టీం: 

మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్,  గ్రాండ్‌హోమ్, మిచెల్ సాట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ
ఫెర్గ్ సన్, ట్రెంట్ బౌల్ట్.