Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: కోహ్లీ, ధోని కొట్టేశారు, షమీ, బుమ్రాలు తిప్పేశారు...విండీస్ పై భారత్ ఘన విజయం

మాంచెస్టర్ ఓల్డ్‌ట్రఫోర్డ్ మైదానం టీమిండియాకు బాగా అచ్చొచ్చినట్లుంది. ఇదే మైదానంలో పాక్ ను మట్టికరిపించిన భారత జట్టు తాజాగా వెస్టిండిస్ ను కూడా చిత్తు చేసింది. 269 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను షమీ  ఆరంభంలోనే  కోలుకోలేని దెబ్బతీశాడు. మిడిల్ ఓవర్లలో బుమ్రా,  చాహల్ లు మిగతా వికెట్లు పడగొట్టడంతో  విండిస్ ఓటమి ఖాయమయ్యింది. 34.2 ఓవర్లలో కేవలం 143 పరుగులకే విండీస్ ఆటగాళ్లు చేతులేత్తేడయంతో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

 

world cup 2019: india vs west indies match updates
Author
Manchester, First Published Jun 27, 2019, 2:43 PM IST

మాంచెస్టర్ ఓల్డ్‌ట్రఫోర్డ్ మైదానం టీమిండియాకు బాగా అచ్చొచ్చినట్లుంది. ఇదే మైదానంలో పాక్ ను మట్టికరిపించిన భారత జట్టు తాజాగా వెస్టిండిస్ ను కూడా చిత్తు చేసింది. 269 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను షమీ  ఆరంభంలోనే  కోలుకోలేని దెబ్బతీశాడు. మిడిల్ ఓవర్లలో బుమ్రా,  చాహల్ లు మిగతా వికెట్లు పడగొట్టడంతో  విండిస్ ఓటమి ఖాయమయ్యింది. 34.2 ఓవర్లలో కేవలం 143 పరుగులకే విండీస్ ఆటగాళ్లు చేతులేత్తేడయంతో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

వెస్టిండిస్ బ్యాట్ మెన్స్ లో ఓపెనర్ ఆండ్రిస్ 31, పూరన్ 28, హెట్మెయర్ 18, రోచ్ 14, కోట్రెల్ 10 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరు కనీసం రెండంకెల స్కోరును కూడా సాధించకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు. దీంతో భారత్ భారీ విజయం సాధ్యమయ్యింది. ఇలా  విండీస్ ను షమీ 4, బుమ్రా 2, చాహల్ 2, కుల్దీప్ 1, పాండ్యా 1 వికెట్ తీసి కుప్పకూల్చారు. 

టీమిండియా బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఒకే ఓవర్లో మాయ  చేశాడు.  వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి విండీస్ బ్యాటింగ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. మొదట బ్రాత్ వైట్ ను ఒక్క పరుగు వద్దే ఔట్ చేసిన బుమ్రా ఆ  తర్వాతి బంతికే అలెన్ ను డకౌట్ చేశాడు. అయితే బుమ్రా హ్యాట్రిక్ సాధించకుండా రోచ్ అడ్డుకున్నాడు.  

ప్రమాదకరంగా మారుతున్న విండీస్ ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్(34 పరుగులు) ను హార్దిక్ పాండ్యా వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు.  అతడిని ఎల్బీ రూపంలో పెవిలియన్ కు పంపడంతో విండీస్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఆ  తర్వాత ఏ దశలోనూ ఆ జట్టు బ్యాటింగ్ విజయం దిశగా సాగలేదు.

269 పరుగుల విజయలయయంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ కు ఆదిలోనే షఎదురుదెబ్బ తగిలింది. ఆరంభంనుండి పరుగులు సాధించడానికి ఇబ్బందిపడుతున్న ఓపెనర్ క్రిస్ గేల్(6 పరుగులు 19 బంతుల్లో) ను షమీ పెవిలియన్ కు పంపించాడు.  ఆ తర్వాత అతడి బౌలంగ్ లోనే హోప్స్ ను కేవలం 5 పరుగుల వద్దే పెవిలియన్ పంపించాడు. ఇలా విండీస్ కేవలం 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 

 కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 పరుగులు), మహేంద్ర సింగ్ ధోని(56 పరుగులు)ల అద్భుతమమైన హాఫ్ సెంచరీలు...కెఎల్ రాహుల్(48 పరుగులు), హార్ధిక్ పాండ్యా(46 పరుగులు) మెరుపులు టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి. వెస్టిండిస్ బౌలర్ల ధాటిని ఎదుర్కొని వీరు పోరాటపటిమను ప్రదర్శించడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.

విండీస్ బౌలర్లో కీమర్ రోచ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. అతడు 3 వికెట్లు పడగొట్టగా హోల్డర్ 2, కోట్రెల్ 2 వికెట్లు పడగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూనే క్రమం తప్పకుండా వికట్లు పడగొట్టడంతో భారత్ ను తక్కువ పరుగులకే కట్టడిచేయగలిగింది.

 టీమిండియా బ్యాటింగ్ లైనప్ విండీస్ బౌలర్ రోచ్ విలవిల్లాడిపోతోంది. కేదార్ జాదవ్(7 పరుగులు)ను కూడా పెవిలియన్ కు పంపించిన రోచ్ మూడో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా టీమిండియా 140 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోగా అందులో మూడు రోచ్ తీసినవే.

  వెంస్టిండిస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోచ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో 29  పరుగుల వద్ద భారత జట్టు మొదటి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది.

ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అందుకు తగ్గట్లుగానే వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లపై సునాయాస విజయాన్ని అందుకున్న భారత జట్టు మరో సమరానికి సిద్దమైంది. మాంచెస్టర్ లోని ఓల్డ్‌ట్రఫోర్డ్ మైదానంలో ఇవాళ( గురువారం)  టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు నిర్వహించిన టాస్ ను  టీమిండియా గెలుచుకుంది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

తుది జట్లు:

టీం ఇండియా:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా. 

వెస్టిండీస్ టీం:

క్రిస్ గేల్, సునీల్ అంబ్రిస్, హోప్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, హెట్మెయర్, జాసన్ హోల్డర్(కెప్టెన్), కార్లోస్ బ్రాత్‌వైట్, అలెన్‌, కోట్రెల్, కీమర్ రోచ్, థామస్. 

Follow Us:
Download App:
  • android
  • ios