Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ సెమీస్: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ రేపటికి వాయిదా

ప్రపంచ కప్ టోర్నీ మూడోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలనుకుంటున్న టీమిండియా ఇవాళ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికన జరగనున్న ఈ  మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను న్యూజిలాండ్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి టీమిండియా మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత  కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించనుంది. 
 

world cup 2019: india vs new zealand semi final match updates
Author
Manchester, First Published Jul 9, 2019, 2:54 PM IST

వర్షం  కారణంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుుతున్న సెమీఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో  ఇవాళ(మంగళవారం)  మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో రేపు(బుదవారం జూలై 10వ తేదీన) నిర్వహించనున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఇప్పుడు ఎక్కడయితే మ్యాచ్ నిలిచిపోయింది అక్కడి నుండే రేపు మ్యాచ్ నిర్వహించనున్నారు.  

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కివీస్ 211పరుగుల వద్ద వుండగా వర్షం మొదలయ్యింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివవేశారు. 

కివీస్ వికెట్ల పతనం కొనసాగుతోంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో గ్రాండ్ హోమ్(16 పరుగులు)  ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. దీంతో డబుల్ సెంచరీ వద్ద కివిస్ మరో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. 

162 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో నీషమ్(12 పరుగులు) కార్తిక్ కు క్యాాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 

న్యూజిలాండ్ ను భారత స్పిన్నర్ చాహల్ కోలుకోలేని దెబ్బతీశాడు. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకుంటూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్(67 పరుగులు)ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో కివీస్ 136 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ విలియమ్సన్ కెప్టెన్  ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకున్న కివీస్ ను అతడు హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నెమ్మదిగా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ 79 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.  దీంతో కివీస్ 30 ఓవర్లలో 2 వికట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.  

హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్న విలియమ్సన్-నికోల్స్ జోడిని రవీంద్ర జడేజా విడగొట్టాడు. 28 పరుగులు చేసిన నికోల్స్ ను ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ 70 పరుగుల వద్ద రెండో వికెట్ చేజార్చుకుంది. 

ప్రపంచ కప్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ తో తలపడుతున్న న్యూజిలాండ్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రా బౌలింగ్ లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి  ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ఔటయ్యాడు.

ప్రపంచ కప్ టోర్నీ మూడోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలనుకుంటున్న టీమిండియా ఇవాళ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికన జరగనున్న ఈ  మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను న్యూజిలాండ్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి టీమిండియా మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత  కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించనుంది. 

ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఓ మార్పు చోటుచేసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యజువేందర్ చాహల్  జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. 

ఇక న్యూజిలాండ్ జట్టుకూడా ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్ లో బరిలోకి దిగిన  సౌథీ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో మళ్లీ ఫెర్గ్ సన్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని టాస్ అనంతరం కెప్టెన్ విలియమ్సన్ వెల్లడించాడు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios