ప్రపంచ కప్ టోర్నీలో మరో మ్యాచ్ వర్షార్ఫణమయ్యింది.  భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరుజట్లు చెరో  పాయింట్ పంచుకున్నాయి. దీంతో న్యూజిలాండ్ అత్యధికంగా 7 పాయింట్లతో టాప్ లో నిలవగా టీమిండియా ఐదు పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యింది. 

ప్రపంచ కప్ టోర్నీలో మరో కీలక మ్యాచ్ కు వర్షం అడ్డుపడుతోంది. ఇంగ్లాండ్ లొ కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే మూడు ప్రపంచ కప్ మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. తాజాగా భారత్-న్యూజిలాండ్ మ్యాచు పరిస్థితి అలాగ కనిపిస్తోంది. నాటింగ్ హామ్ లో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఈ  మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

కనీసం టాస్ నిర్వహించడానికి కూడా వీలు లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ ఆరంభానికే కాదు టాస్ కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశం వుందని నిర్వహకులు  తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానం అభిమానుల్లో నెలకొంది. 


తుది జట్లు ( ఏషియా నెట్ అంచనా ప్రకారం) 

భారత్ టీం: 

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ లేదా  విజయ్ శంకర్, మహేంంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా , భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేందర్ చాహల్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా

న్యూజిలాండ్ టీం:

మార్టిన్ గప్టిల్, మున్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాట్నర్, గ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, ఫెర్గ్ సన్, ట్రెంట్ బౌల్ట్