Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: రూట్ అద్భుత శతకం...విండీస్ పై ఇంగ్లాండ్ ఘన విజయం

విండీస్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ మరోసారి సత్తా చాటింది. మొదట ఇంగ్లీష్ బౌలర్లు ఆ తర్వాత బ్యాట్ మెన్స్ చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ రూట్ (100 పరుగులు 94 బంతుల్లో) అద్భుత శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అతడి  తోడుగా బెయిన్ స్టో (45 పరుగులు), వోక్స్(40 పరుగులు) రాణించడంతో కేవలం 33.1ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ విజయతీరాలకు చేరుకుంది. 

world cup 2019: england vs west indies match updates
Author
Southampton, First Published Jun 14, 2019, 2:50 PM IST

విండీస్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ మరోసారి సత్తా చాటింది. మొదట ఇంగ్లీష్ బౌలర్లు ఆ తర్వాత బ్యాట్ మెన్స్ చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ రూట్ (100 పరుగులు 94 బంతుల్లో) అద్భుత శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అతడి  తోడుగా బెయిన్ స్టో (45 పరుగులు), వోక్స్(40 పరుగులు) రాణించడంతో కేవలం 33.1ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ విజయతీరాలకు చేరుకుంది. 

213 పరుగుల స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. జో రూట్, బెయిర్ స్టో లు ఒకరితో పోటీ పడుతూ మరొకరు పరుగులు సాదిస్తూ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే సెంచరీ భాగస్వామ్యానికి చేరువలో వుండగా బెయిర్ స్టో (45 పరుగులు) గాబ్రియెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  దీంతో ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది.

 అంతకుముందు ఆతిథ్య ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి విండీస్ 212 పరుగులకే ఆలౌటయ్యింది. మ్యాచ్ ఆరంభం నుండి ఇంగ్లీష్ బౌలర్లు విరామం లేకుండా వికెట్లు పడగొడుతూ విండీస్ ను దెబ్బతీశారు. అయితే మధ్యలో పూరన్ (63 పరుగులు), హెట్మెయర్ (39 పరుగులు) లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఈమాత్రం స్కోరయినా సాధ్యమయ్యింది. అంతేకాకుండా ఆరంభంలో గేల్ (36 పరుగులు) పరవాలేదనిపించాడు. 

ఇంగ్లాండ్ బౌలర్లలో  ఆర్చర్ 9 ఓవర్లపాట్ బౌలింగ్ చేసి కేవలం 30 పరుగులు మాత్రమే సమర్పించుకుని  3 వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ 3, రూట్ 2, వోక్స్ 1, ఫ్లంకెట్ 1 వికెట్ పడగొట్టారు.  

ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి విండీస్ టపటపా వికెట్లు కోల్పోతోంది. ఆర్చర్ వరుస బంతుల్లో పూరన్ (63 పరుగులను), కోట్రెల్ (0 పరుగులు) ను ఔట్ చేశాడు. అయితే అతడి హ్యాట్రిక్ ఛాయిస్ ను థామస్ అడ్డుకున్నాడు. 

 నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డ విండీస్ రూట్ షాకిచ్చాడు. పూరన్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ ప్రమాదకంగా మారుతున్న హెట్మెయర్  (39 పరగులు) ని రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ కు పంపగా...ఆ తర్వాత కెప్టెన్ హోల్డర్ ను కూడా కేవలం 9 పరుగుల వక్తిగత స్కోరు వద్ద అదేవిధంగా ఔట్ చేశాడు. దీంతో విండీస్  156 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 

ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి విండీస్ టాపార్డన్ బ్యాట్ మెన్స్ టపటపా  వికెట్లు కోల్పోతున్నారు.  కేవలం మూడు  బంతుల తేడాతో ఓపెనర్ గేల్ (36 పరుగులు), హోప్స్ (11 పరుగులు) ఔటయ్యారు. మొదట గేల్ ఫ్లంకెట్ బౌలింగ్ లో వికెట్ చేజార్చుకోగా...ఆ తర్వాత హోప్స్ ను వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 55 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లోకి జారుకుంది. 

ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విండీస్ ఆరంభంలోనే తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న విండీస్ కేవలం 4 పరుగులకే ఓపెనర్ లూవిస్ వికెట్ కోల్పోయింది. వోక్స్ ఓ అద్భుత  బంతితో అతన్ని బోల్తా కొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ( శుక్రవారం) ఆతిథ్య ఇంగ్లాండ్, వెస్టిండిస్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను ఆతిథ్య జట్టు గెలుచుకుంది. దీంతో కెప్టెన్ మోర్గాన్ మొదట ఫీల్డింగ్ చేయడానికే మొగ్గుచూపాడు. దీంతో విండీస్ మొదట బ్యాటింగ్ చేపట్టాల్సి వస్తోంది.

తుది జట్లు:

వెస్టిండిస్ టీం:

క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, హోప్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, హెట్మెయర్, జాసన్ హోల్డర్(కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, బ్రాత్ వెట్, గాబ్రియెల్, కోట్రెల్, థామస్ 

ఇంగ్లాండ్ టీం:

జాసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెస్ స్టోక్స్, జాస్ బట్లర్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, ఫ్లంకెట్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ 
 

Follow Us:
Download App:
  • android
  • ios