Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: నేరుగా సెమీస్ కు ఇంగ్లాండ్... న్యూజిలాండ్ పై ఘన విజయం

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ కు చేరింది. ఎలాంటి  సమీకరణలు లేకుండానే నేరుగా సెెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. బలమైన న్యూజిలాండ్ జట్టును ఏకంగా 119 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయాన్ని అందుకుంది. 

world cup 2019: england  vs  new zealand match updates
Author
Chester-le-Street, First Published Jul 3, 2019, 3:01 PM IST

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్ కు చేరింది. ఎలాంటి  సమీకరణలు లేకుండానే నేరుగా సెెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. బలమైన న్యూజిలాండ్ జట్టును ఏకంగా 119 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయాన్ని అందుకుంది. 

306 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి  దిగిన కివీస్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. కేవలం లాథమ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో కాస్సేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. విలియమ్సన్ 27, టేలర్ 28, నీషమ్ 19, సాట్నర్ 12 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. దీంతో కీవీస్ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక వోక్స్, ఆర్చర్, ఫ్లంకెట్, రషీద్, స్టోక్స్ లు తలో వికెట్  పడగొట్టారు. అంతేకాకుండా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేసి ఇద్దరు కీవీస్ ప్లేయర్స్ ని రనౌట్ చేశారు. 

 306 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ను ఇంగ్లాండ్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్ళ అద్భుతమైన ఫీల్డింగ్ కు విలియమ్సన్, టేలర్లు బలయ్యారు. ఆ  తర్వాత నీషమ్(19 పరుగులు) , గ్రాండ్ హోమ్(3 పరుగులు) ఔటయ్యారు. దీంతో 128 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. 

306 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్  ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగలింది. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి కివీస్ 14 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. మొదట నికోల్స్ ని వోక్స్ డకౌట్ చేయగా...గుప్తిల్(8 పరుగులు) ను ఆర్చర్ పెవిలియన్  కు పంపించాడు. దీంతో కివీస్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో  పడింది. 

 ప్రపంచ  కప్ టోర్నీలో సెమీస్ కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు ఓపెనర్లు మరోసారి శుభారంభాన్నిచ్చారు. అయితే మిగతా ఆటగాళ్లెవరు రాణించకపోవడంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న ఆతిథ్య జట్టు 305 పరుగులు చేసింది. మొదట బెయిర్ స్టో(106 పరుగులు) అద్భుత సెంచరీ, జాసన్ రాయ్(60 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో 123 పరుగుల  ఓపెనింగ్ భాగస్వామ్యం  నమోదయ్యింది. అయితే వారిద్దరు ఔటైన తర్వాత ఇంగ్లాండ్ టపటపా వికెట్లు కోల్సోయింది. 

అయితే కాస్సేపు కెప్టెన్ ఇయన్ మోర్గాన్(42 పరుగులు) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. దీంతో భారీ పరుగులు చేస్తుందనుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 305 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్, నీషమ్, హెన్రీలు తలో రెండు  వికెట్లు పడగొట్టగా సాట్నర్ కు ఓ వికెట్ దక్కింది. 

 ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో  ఈ మ్యాచ్ ద్వారా వరుసగా రెండో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. టీమిండియాపై  సెంచరీతో  చెలరేగిన అతడు ఈ మ్యాచ్ లోనూ 95 బంతుల్లోనే శతకాన్ని  సాధించాడు. 

న్యూజిలాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్  ఓపెనింగ్ జోడి మరోసారి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.   బెయిర్ స్టో, జాసన్ రాయ్ లు కలిసి 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే రాయ్(60 పరుగులు) హాఫ్ సెంచరీ తర్వాత మరింత వేగంగా పరుగులు సాధించడానికి ప్రయత్నించి  నీషమ్ బౌలింగ్ లో  ఔటయ్యాడు. దీంతో మొదటి  వికెట్ బాగస్వామ్యానికి  తెరపడింది. 

ప్రపంచ కప్ టోర్నీ చివరిదశకు చేరుకుంటున్నకొద్దీ మ్యాచులు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సెమీస్ కు చేరేందుకు అన్ని జట్లు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి.ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్ కూడా నాలుగో స్థానం కోసం పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఆరంభంకానున్న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ ద్వారా సెమీస్ కు చేరేది ఎవరన్నదానిపై క్లారిటీ రానుంది. 

దీంతో చెస్టర్ లి స్ట్రీట్ వేదికన జరగనున్న ఈ మ్యాచ్ ఫలితం కోసం అన్ని జట్లు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను ఆతిథ్య జట్టు గెలుచచుకుంది. దీంతో మరో ఆలోచన లేకుండా  మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి కివీస్ మొదట  బౌలింగ్ చేసి ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగనుంది. 

తుది జట్లు: 

ఇంగ్లాండ్:

జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), క్సిన్ వోక్స్, లియమ్ ఫ్లంకెట్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్,, మార్క్ వుడ్

న్యూజిలాండ్:  

మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లూథమ్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, గ్రాండ్ హోమ్, సాట్నర్, టామ్ సౌథీ, హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ 
 

Follow Us:
Download App:
  • android
  • ios