Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: ఫించ్ సెంచరీ కొట్టుడు...స్టార్క్ వికెట్లు పట్టుడు...లంకపై ఆసిస్ ఘన విజయం

శ్రీలంక కెప్టెన్ వీరోచితంగా పోరాడినా మిగతా  ఆటగాళ్లెవరూ రాణించకపోడంతో ప్రపంచ  కప్ టోర్నీలో ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ బౌలర్లు చేతులెత్తేసి భారీగా పరుగులు సమర్పించుకున్నా కెప్టెన్ కరుణరత్నే అద్భుతంగా  బ్యాటింగ్ చేసి లంక గెలుపుపై ఆశలు కలిగించాడు. అయితే 97 పరుగులు చేసి సెంచరీకి చేరువలో అతడు వికెట్ కోల్పోవడంతో లంక కథ అయిపోయింది. అతడు ఔటైన వెంటనే జట్టు జట్టంతా పేకమేడలా కూలిపోయింది. దీంతో 335 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 247 పరుగులకే ఆలౌట్ మరో ఓటమిని మూటగట్టుకుంది. 

world cup 2019: australia vs sri lanka match updates
Author
London, First Published Jun 15, 2019, 2:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

శ్రీలంక కెప్టెన్ వీరోచితంగా పోరాడినా మిగతా  ఆటగాళ్లెవరూ రాణించకపోడంతో ప్రపంచ  కప్ టోర్నీలో ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ బౌలర్లు చేతులెత్తేసి భారీగా పరుగులు సమర్పించుకున్నా కెప్టెన్ కరుణరత్నే అద్భుతంగా  బ్యాటింగ్ చేసి లంక గెలుపుపై ఆశలు కలిగించాడు. అయితే 97 పరుగులు చేసి సెంచరీకి చేరువలో అతడు వికెట్ కోల్పోవడంతో లంక కథ అయిపోయింది. అతడు ఔటైన వెంటనే జట్టు జట్టంతా పేకమేడలా కూలిపోయింది. దీంతో 335 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 247 పరుగులకే ఆలౌట్ మరో ఓటమిని మూటగట్టుకుంది. 

335 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు కరుణరత్నే, పెరేరాలు కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని  నెలకొల్పారు. అయితే  ఈ క్రమంలోనే  మరిత దాటిగా ఆడబోయిన పెరేరా( 52 పరుగులు  36 బంతుల్లో) ను స్టార్క్ ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 115 పరుగుల వద్ద లంక మొదటి వికెట్ పడటంతో పతనం మొదలయ్యింది.

ఆసిస్ బౌలర్లలో స్టార్క్ అద్భుత ప్రదర్శనను కనబర్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అలాగే  రిచర్డ్ సన్ 3, కమ్మిన్స్ 2,  బెహ్రండార్ప్ 1  వికెట్ పడగొట్టి శ్రీలంక బ్యాటిగ్ లైనప్ ను కుప్పకూల్చారు. దీంతో ఆసిస్ 87 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

 అంతకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ విశ్వరూపం చూపించాడు. అతడు కేవలం 132 బంతుల్లోనే 153 పరుగులు చేయడంతో ఆసిస్ 334 పరుగులు భారీ స్కోరు  నమోదయ్యింది. అతడికి తోడుగా స్మిత్ 59 బంతుల్లో 73 పరుగులు చేశాడు.అయితే వీరిద్దరు ఔటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు పడుతున్న సమయంలో మ్యాక్స్ వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. ఇక లంక బౌలర్లలో ఉదానా2, డిసిల్వా 2, మలింగ 1 వికెట్ పడగొట్టారు. మిగతా ఇద్దరు ఆసిస్ బ్యాట్ మెన్స్ రనౌటయ్యారు. 

  శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాటిగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(26 పరుగులు) తో కలిసి ఆసిస్ కు 80 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించాడు.   

ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా-శ్రీలంక ల మధ్య పోరుకు రంగం సిద్దమైంది. లండన్ వేదికగా ప్రారంభంకానున్న మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆసిస్ మొదట బ్యాటింగ్ కు  దిగనుంది.

టాస్ అనంతరం శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె మాట్లాడుతూ...''గతకొద్ది రోజులగా ఇక్కడ వర్షం కురుస్తోంది. కాబట్టి ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలనే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాం. నువాన్ ప్రదీప్ మంచి ఫిట్ నెస్ తో వున్నాడు. అలాగే లక్మల్ స్థానంలో సిరివర్థనే జట్టులోకి వచ్చాడు.'' అని వెల్లడించాడు. 

అలాగే ఫించ్ మాట్లాడుతూ...'' మేం టాస్ గెలిచిన మందు బౌలింగ్ చేయడానికే ఇష్టపడేవారిమి. కానీ టాస్ శ్రీలంక గెలిచింది కాబట్టి వారి నిర్ణయాన్నే మేం ఫాలో కావాల్సి వుంటుంది. ఈ మ్యాచ్ లో నాథన్ కుల్టర్ నైల్ స్ధానంలో బెహ్రెంఢార్ఫ్ జట్టులో చేరాడు.'' అని వెల్లడించాడు. 

తుది జట్లు:

ఆస్ట్రేలియా టీం:

ఆరోన్ పించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అలెక్స్ హేల్స్(వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జాసన్ బెహ్రెండార్ఫ్, కేన్ రిచర్డ్ సన్ 

శ్రీలంక టీం:

దిముత్ కరుణరత్నే(కెప్టెన్),లహిరు తిరుమన్నే, కుశాల్ పెరేరా(వికెట్ కీపర్), కుశాల్ మెండిస్, ఆంజెలో మాథ్యూస్, ధనంజయ  డిసిల్వా, థిసారా పెరేరా, ఇసురు ఉదానా, మిలింద సిరివర్థన, నువాన్ ప్రధీప్, లసిత్ మలింగ

Follow Us:
Download App:
  • android
  • ios