ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్ సౌతాఫ్రికా అదరగొట్టింది. ఆస్ట్రేలియా టాప్ లేపుతూ అద్భుత  విజయాన్ని అందుకుంది. 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ 315 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. 

భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత సెంచరీని నమోదుచేసుకున్నాడు. అతడు 117 బంతుల్లోనే 122 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్యారీ విధ్వంసం కొనసాగింది. అతడు కేవలం 69 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు అయితే చివరకు వీరిద్దరి పోరాటం వృధా అయ్యి దక్షిణాఫ్రికా విజయాన్ని అందుకుంది. 

సౌతాఫ్రికా బౌలర్లలో రబడ 3 వికెట్లతో చెలరేగాడు. అతడి తర్వాత ప్రెటోరియస్ 2, ఫెహ్లుక్వాయో 2, తాహిర్ 1, మొర్రిస్ 1 వికెట్ తీసి ఆసిస్ ను ఆలౌట్ చేశారు. 

విజయం దిశగా ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో ఆసిస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓ వైపు  వికెట్లు పడుతున్నా ఒత్తిడికి లోనవకుండా సెంచరీ(122 పరుగులు)తో అదరగొట్టిన వార్నర్ ఔటయ్యాడు. 227 పరుగుల వద్ద పెట్రోరియస్ బౌలింగ్ లో మొర్రిస్  కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్ చేరాడు. 

ఆస్ట్రేలియా వికెట్ల పతనం కొనసాగుతోంది. 95 పరుగుల వద్దే మూడు వికట్లు కోల్పోయిన ఆ జట్టు 119 వద్ద నాలుగో వికెట్ చేజార్చుకుంది.హార్డ్ హిట్టర్ మ్యాక్స్ వెల్ ను రబడ ఔట్ చేశాడు. 

95 పరుగుల వద్ద ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి స్టోయినీస్(22 పరుగులు)  రనౌటయ్యాడు. 

ఆసిస్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి స్మిత్ ఔటయ్యాడు. ప్రెటోరియస్ బౌలింగ్ లో స్మిత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయి ఎల్బీడబ్యూ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో 33 పరుగుల వద్ద ఆసిస్ రెండో వికెట్ కోల్పోయింది. 

326 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. సౌతాఫ్రికా  బౌలర్ ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లోఆసిస్ కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్  3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఉస్మాన్ ఖవాజా కూడా గాయం కారణంగా రిటైర్డ్ హట్ గా  వెనుదిగాడు. దీంతో ఐదు పరుగులకే ఆసిస్ ఓ వికెట్ కోల్పోయింది.  

చివరి ప్రపంచ కప్ మ్యాచ్ లో సౌతాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. ఆసిస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కెప్టెన్ డుప్లెసిస్(100 పరుగులు 94 బంతుల్లో) అద్భుత శతకాన్ని బాదాడు.  అయితే సెంచరీ  చేసిన వెంటనే అతడు బెహ్రెండార్ఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో 265 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 

ఆస్ట్రేలియా బౌలర్ లియాన్ దెబ్బకు సఫారీ జట్టు ఓపెనర్లిద్దరు పెవిలియన్ కు చేరారు.మొదట మార్క్రమ్(34 పరుగులు) ఔట్ చేసిన అతడు తాజాగా హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డికాక్‘54 పరుగులు) ను కూడా పెవిలియన్ కు చేర్చాడు. దీంతో 114 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 

ప్రపంచ కప్ లీగ్ దశ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే పాయింట్స్ టేబుల్ టాప్ స్థానంలో నిలిచిన ఆసిస్ సేమీస్ కు చేరింది. అయితే ఈ మెగాటోర్నీలో ఘోరంగా విఫలమైన సౌతాఫ్రికా సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది.  దీంతో సౌతాఫ్రికా ఈ మ్యాాచ్ తర్వాత ఇంటిముఖం పట్టనుంది. 

అయితే ఈ మ్యాచ్ ఫలితం సెమీఫైనల్లో ఏయే జట్లు ఎవరితో తలపడనున్నాయో తేల్చనుంది. అంతేకాకుండా ఆసిస్ టాప్ స్థానాన్ని పదిలంగా వుంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవాల్సిందే. లేదంటే అందుకోసం కాచుకుని కూర్చున్న టీమిండియా ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశం వుంది. 

ఇలా సెమీఫైనల్ ను ప్రభావితం చేసే ఈ మ్యాచ్ మాంచెస్టర్ వేదికన జరగుతోంది. ఇందుకోసం ఇప్పటికే చేపట్టిన టాస్ ను సఫారీ జట్టు గెలుచుకుంది. దీంతో డుప్లెసిస్ మొదట బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. దీంతో ఆసిస్ మొదట బౌలింగ్ చేసి  ఆ తర్వాత చేజింగ్ కు దిగనుంది.