Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: బ్యాట్ తో ఖవాజా, బంతితో స్టార్క్ విజృంభణ...కివీస్ పై ఆసిస్ ఘన విజయం

లార్డ్ వేదికగా న్యూజిలాండ్ తో  జరిగిన మ్యాచ్ లో ఆసిస్ ఆధిపత్యం కొనసాగింది. మొదట ఖవాజా(88 పరుగులు), క్యారీ(71 పరుగులు) సమయోచిత బ్యాటింగ్ తో ఆసిస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు  చేసింది. అయితే ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంతో కివీస్ విఫలమైంది. కేవలం 43.4 ఓవర్లలోనే  157 పరుగులకు న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అవడంతో 86  పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. 

world cup 2019: australia vs  new zealand match updates
Author
London, First Published Jun 29, 2019, 6:02 PM IST

లార్డ్ వేదికగా న్యూజిలాండ్ తో  జరిగిన మ్యాచ్ లో ఆసిస్ ఆధిపత్యం కొనసాగింది. మొదట ఖవాజా(88 పరుగులు), క్యారీ(71 పరుగులు) సమయోచిత బ్యాటింగ్ తో ఆసిస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు  చేసింది. అయితే ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంతో కివీస్ విఫలమైంది. కేవలం 43.4 ఓవర్లలోనే  157 పరుగులకు న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అవడంతో 86  పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. 

న్యూజిలాండ్ జట్టును కుప్పకూల్చచడంతో స్టార్క్ ముఖ్య భూమిక పోషించాడు. అతడు 9.4 ఓవర్లు బౌలింగ్ చేసి కేేవలం 26 పరుగులు మాత్రమే సమర్పించుకుని ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడుగా బెహ్రెండార్ఫ్ 2, కమ్మిన్స్, లియాన్, స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. 

131 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.  లియాన్ బౌలింగ్ లో నీషమ్(9 పరుగులు) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకు ముందు  లాథమ్(14 పరుగులు) ను ఆసిస్ బౌలర్ స్టార్క్ ఔట్ చేశాడు.  

ఆసిస్ బౌలర్ల ధాటికి కివీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టేలర్(30 పరుగులు)ని కమ్మిన్స్ ఔట్ చేశాడు. ఆ వెంటనే స్మిత్ బౌలింగ్ లో గ్రాండ్ హోమ్ ఔటయ్యాడు.. ఇలా 118 పరుగుల వద్ద వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఆసిస్ బౌలర్ బెహ్రెండార్ఫ్ బౌలింగ్ లో నికోల్స్(8 పరుగులు), మార్టిన్ గప్తిల్ (20 పరుగులు) ఔటయ్యారు. దీంతో కేవలం 42 పరుగలకే న్యూజిలాండ్ ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోగా కెప్టెన్ విలియమ్సన్(40 పరుగులు) ను స్టార్క్ బౌలింగ్ లో మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తట్టుకోలేకపోయింది. బుల్లెట్లలా దూసుకొచ్చే బౌల్ట్; పెర్గుసన్ బంతులను ఎదుర్కోవడంతో ఆసిస్ బ్యాటింగ్ లైనప్ విఫలమయ్యింది. అయితే ఖవాజా(88 పరుగులు), క్యారీ( 71 పరుగులు)లు ఆసిస్ నుు ఆదుకున్నారు. దీంతో ఫించ్ సేన 243 పరుగులు చేయగలిగింది. 

ఇక ఈ  మ్యాచ్ చివరి ఓవర్లో బౌల్ట్ మాయ చేశాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. మొదట ఖవాజాను ఔట్ చేసిన బౌల్ట్ ఆ వెంటనే స్టార్క్, బెహ్రెండార్ఫ లను డకౌట్ చేశాడు. దీంతో అతడి ఖాతాలోకి మరో హ్యాట్రిక్ చేరింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4, ఫెర్గ్ సన్ 2, నీషమ్ 2, విలియమ్సన్ 1 వికెట్ పడగొట్టారు.   

ఆసిస్ వికెట్ల పతనాన్ని అడ్డుకుని హాఫ్ సెంచరీతో అదరగొట్టిన క్యారీని ఎట్టకేలకు కివీస్ బౌలర్లు ఔట్ చేశారు. 71  పరుగులు  చేసిన అతడిని విలియమ్సన్ పెవిలియన్ కు పంపించాడు.  అంతకుముందు  విధ్వంసకర ఆటగాడు మ్యాక్ప్ వెల్ ను పరుగులేమీ సాధించకుండానే పెవిలియన్ కు పంపించాడు. నీషమ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన మ్యాక్స్ వెల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ఆసిస్ నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న స్టోయినీస్(21 పరుగులు) కివీస్ బౌలర్  నీషమ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బంతి బ్యాట్ అంచుల్ని తాకుకుంటూ వెళ్ళి నేరుగా కీపర్ లాథమ్ చేతికి చిక్కింది. దీంతో 81  పరుగులకే ఆసిస్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 

కివీస్ బౌలర్ల ధాటికి ఆసిస్ టాప్ ఆర్డర్ కుప్పకూలుతోంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(16 పరుగులు), స్మిత్ (5 పరుగులు) లను ఫెర్గ్ సన్ వరుస ఓవర్లలో పెవిలియన్ కు పంపించాడు. దీంతో ఆసిస్ 46 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ ఫించ్(8 పరుగులు) ను కివీస్ బౌలర్ బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు ఎల్బీగా వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 15 పరుగుల వద్ద ఆసిస్ మొదటి  వికెట్ కోల్పోయింది. 

ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోని ప్రఖ్యాత లార్డ్ మైదానం మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. ప్రపంచ కప్  టోర్నీలో వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్ కు చేరిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో టాప్ కోసం తలపడుతున్నాయి.  టోర్నీ ఆరంభం నుండి అత్యధిక విజయాలతో పాయింట్స్ టేబులో అగ్రస్థానంలో నిలిచిన కివీస్ ను ఇటీవలే ఆస్ట్రేలియా వెనక్కినెట్టింది.  ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలవనుంది. 

ఈ క్రమంలో ఆసిస్ ను ఓడించి టాప్ ప్లేస్ ను కైవసం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది. అయితే గత మ్యాచ్లో ఆతిథ్య జట్టును ఓడించి ్మంనాడు చి ఊపుమీదును ఆసిస్ ఈ మ్యాచ్ లోనూ విజయాన్ని అందుకుని తిరుగులేని ఆధిక్యాన్ని పొందాలని చూస్తోంది. ఇలా ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 

మ్యాచ్ కు ముందు నిర్వహించిన టాస్ ను ఆసిస్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ వైపే మొగ్గుచూపాడు. దీంతో కివీస్ మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్ కు దిగనుంది. 

తుది జట్లు:

ఆస్ట్రేలియా టీం:

ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెస్ మ్యాక్స్ వెల్, స్టోయినీస్, క్యారే(వికెట్ కీపర్), కమ్మిన్స్, స్టార్క్, లియాన్, బేహ్రెండార్ఫ్

న్యూజిలాండ్ టీం:

మార్టిన్ గప్తిల్, నికోల్స్, విలియమ్సన్(కెప్టెన్), టేలర్, లాథమ్(వికెట్ కీపర్), నీషమ్, గ్రాండ్ హోమ్, సాట్నర్, సౌథీ, ఫెర్గ్ సన్, బౌల్ట్
   
 

Follow Us:
Download App:
  • android
  • ios