ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ను స్వల్ప తేడాతో పొగొట్టుకోవడంపై వెస్టిండీస్ కెప్టెన్‌ జేసన్ హోల్డర్ స్పందించాడు. నాథన్ కౌల్టర్ నైల్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడే మేం క్యాచ్ విడిచిపెట్టామని.. ఆ తర్వాత తను మరో ముప్పై పరుగులు చేశాడు.

అదే మా ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. అలాగే లక్ష్య ఛేదనలో తమ బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడలేదని హోల్డర్ వివరించాడు. మొదట్లోనే మ్యాచ్‌పై పట్టుబిగించామని.. అయితే బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిందిని పేర్కొన్నాడు.

ఇంకా ఆరంభంలోనే ఉన్నాం కాబట్టి.. తదుపరి జరగునున్న మ్యాచ్‌లలో పైచేయి సాధించాలని హోల్డర్ స్పష్టం చేశాడు. ఈ విజయంపై ఆసీస్ కెప్టెన్ కౌల్టర్ నైల్ మాట్లాడుతూ.. నిజానికి తాను అన్ని పరుగులు సాధిస్తానని కూడా అనుకోలేదన్నాడు.

బ్యాట్స్‌మెన్ త్వరగా ఔటవ్వడం.. తన క్యాచ్ డ్రాప్ అవ్వడంతో మంచి స్కోర్ చెయ్యగలిగానని కౌల్టర్ నైల్ పేర్కొన్నాడు.