మాంచెస్టర్: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఓటమి ఎరుగని భారత్ ఆదివారంనాటి మ్యాచ్‌లో మరో రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. 

ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. 2015 ప్రపంచకప్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కాగా, తాజా స్కోరుతో ఆ రికార్డు చెరిగిపోయింది.

ప్రపంచకప్‌లో ఆరంభపు మ్యాచ్‌లోనే టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్‌ దక్కించుకొని సరికొత్త రికార్డు స్థాపించాడదు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌‌(7)ను వికెట్ తీసి ఆ రికార్డును స్థాపించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఐదో ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన అనంతరం అనివార్యమైన స్థితిలో భువనేశ్వర్‌ మైదానం వీడాడు. 

దాంతో చివరి రెండు బంతులు వేయడానికి విజయ్‌ శంకర్‌ బంతిని అందుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్‌ విజయ్ శంకర్ వికెట్ దక్కించుకున్నాడు. టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో పాక్‌తో మ్యాచ్‌కు విజయ్‌ శంకర్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అవకాశం కల్పించింది. 

బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోని శంకర్‌, బౌలింగ్‌లో సత్తా చాటాడు. రెండోసారి 166 పరుగుల పాక్ స్కోరు వద్ద ఆట నిలిచిపోయే సమయానికి అతను రెండు వికెట్లు తీశాడు.