Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: రోహిత్ కొట్టేశాడు...బుమ్రా, పాండ్యా తిప్పేశారు...ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదేనేమో. ఎక్కడయితే ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై విమర్శలను ఎదుర్కుందో అదే బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ మైదానంలో బంగ్లాదేశ్ ను చిత్తుచేసి టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు, బౌలింగ్ లో బుమ్రా, పాండ్యాలు అదరగొట్టడంతో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

icc world cup: india vs bangladesh match updates
Author
Birmingham, First Published Jul 2, 2019, 3:08 PM IST

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదేనేమో. ఎక్కడయితే ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై విమర్శలను ఎదుర్కుందో అదే బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ మైదానంలో బంగ్లాదేశ్ ను చిత్తుచేసి టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు, బౌలింగ్ లో బుమ్రా, పాండ్యాలు అదరగొట్టడంతో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

315 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి బంగ్లాకు షకిబ్ అల్ హసన్(66 పరుగులు), సౌమ్య సర్కార్(33 పరుగులు) రాణించారు. అయితే మిగతి ఆటగాళ్లు విఫలమవడంతో ఆసాంతం బంగ్లా ఇన్నింగ్స్ ఓటమి దిశగానే సాగింది. అయితే చివర్లో మహ్మద్ సైఫుద్దిన్ (38 బంతుల్లో 51 పరుగులు నాటౌట్)హాఫ్ సెంచరీ, షబ్బీర్ రహ్మాన్(36పరుగులు) చేయడంతో బంగ్లా గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే బుమ్రా ఆ ఆశలపై నీళ్లు చల్లాడు. వెంటవెంటనే  లోయర్ ఆర్డర్ ని పెవిలియన్ కుచేరడంతో బంగ్లా 286 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో  టీమిండియా 28 పరుగులతో విజయాన్ని అందుకుంది.

టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ సింగ్ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 56 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో రాణించలేకోయినా బౌలింగ్ లో అదరగొట్టి 3 వికెట్లు  పడగొట్టాడు. ఇక భువనేశ్వర్, షమీ, చాహల్ తలో వికెట్ పడగొట్టి బంగ్లాను కుప్పకూల్చడంలో వారిద్దరికి సహకరించారు. 

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఓటమి దిశగా సాగుతోంది. గెలుపు కొద్దిగా ఆశలు రేకెత్తించిన షబ్బీర్ రహ్మాన్(36  పరుగులు) ను బుమ్రా ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ మోర్తజా ను భువనేశ్వర్ కుమార్ ఎనిమిదో వికెట్ రూపంలో పెవిలియన్ కు పంపించాడు. అంంతకు ముందు ఆరో వికెట్ రూపంలో షకిబ్ అల్ హసన్(66 పరుగులు) ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే మొసద్దిక్(3 పరుగులు) ఔటయ్యాడు.    

 మరో వికెట్  పడకుండా జాగ్రత్తపడుతున్న బంగ్లాకు చాహల్ షాకిచ్చాడు. చాహల్ బౌలింగ్ లో ముష్ఫికర్ రహీమ్(24 పరుగులు) బంతిని గాల్లోకి లేపగా షమీ ఆ క్యాచ్ ను అందుకున్నాడు.  

 315 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(22 పరుగులు)ను షమీ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు.  ఆ తర్వాత సౌమ్య సర్కార్(33 పరుగులు) పాండ్యా బౌలింగ్ లో రెండో వికెట్ రూపంలో మైదానాన్ని వీడాడు. 

బర్మింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు చెలరేగడంతో భారీ స్కోరు సమోదయ్యింది. అయితే భారత జట్టు ఆరంభం అదిరినా ముగింపు మాత్రం చెత్తగా సాగింది. దీంతో మరికొన్ని  పరుగులు సాధించాల్సిన అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది.

రోహిత్  శర్మ(104 పరుగులు) సెంచరీ, కెఎల్ రాహుల్( 77 పరుగులు) హీఫ్ సెంచరీతో చేలరేగడంతో భారత జట్టు వికెట్లేవీ నష్టపోకుండానే 180 పరుగులు చేసింది. అయితే సెంచరీ చేసిన వెంటనే రోహిత్ ను సౌమ్య సర్కార్ ఔట్ చేయడంతో వికెట్ల పతనం మొదలయ్యింది. ఆ వెంటనే రాహుల్ కూడా 195 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక మిగతా ఆటగాళ్లలో రిషబ్ పంత్(48 పరుగులు), ధోని(35 పరుగులు) మాత్రమే ఫరవాలేదనిపించారు.

అయితే డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడానికి ప్రయత్నించడంతో వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. చివరి ఓవర్లోనే ధోని, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ లు ఔటయ్యారు. ఇలా చివరి ోవర్లలో పరుగుల వేగం తగ్గడంతో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బంగ్లా బౌలర్లలో ముస్తాఫీజుర్ రహ్మాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక మిగతా బౌలర్లు షకిబ్ అల్ హసన్, సౌమ్య  సర్కార్, రూబెల్ హుస్సెన్ తలో వికెట్ పడగొట్టారు. 

ప్రపంచ కప్ టోర్నీలో మొదటి హాఫ్ సెంచరీ సాధించే అవకాశాన్ని యువ క్రికెటర్ రిషబ్ పంత్ మిస్సయ్యాడు. పంత్ కేవలం 41 బంతుల్లోనే 48 పరుగులు చేసి కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.  

రహ్మాన్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మొదట కోహ్లీని ఔట్ చేసిన రహ్మాన్ ఆ వెంటనే పాండ్యాను కూడా డకౌట్ చేశాడు.ఇలా టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

 రోహిత్ సెంచరీ చేసిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అతడు శతకం బాదిన వెంటనే  మరో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. 104 పరుగుల వద్ద సౌమ్యా సర్కార్ బౌలింగ్ లో అతడు లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ తర్వాత హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ కెఎల్ రాహుల్ (77 పరుగులు) రూబెల్ హుస్సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  

ప్రపంచ కపస్ 2019 లో రోహిత్ శర్మ  మరో సెంచరీతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లను ఆరంభం నుండి ఊచకొత కోస్తూ కేవలం 90 బంతుల్లోనే 5 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ మెగా  టోర్నీలో అతడి ఖాతాలోకి నాలుగో సెంచరీ చేరింది. అలాగే ఈ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండోో స్థానాన్ని ఆక్రమించాడు. 

 ప్రపంచ కప్ టోర్నీలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ వేదికన టీమిండియా-బంగ్లాదేశ్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్  ఫలితం ఇరు జట్ల సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగగా చివరకు టీమిండియాదేే పైచేయిగా నిలిచింది.    

ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను  టీమిండియా గెలుచుకుంది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ మొదట  బౌలింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్ కు దిగి  ఓటమిపాలయ్యింది.  

ఇదే బర్మింగ్ హామ్ స్టేడియంలో గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమిపాలయ్యింది. దీంతో జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్ యాదవ్, కేదార్ జాదవ్ లు తుది జట్టులో చోటు కోల్పోగా వారి స్థానంలో భువనేశ్వర్ కుమార్,  దినేశ్ కార్తిక్ లు జట్టులోకి వచ్చారు. 

ఇక బంగ్లాదేశ్ జట్టులో కూడా రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిట్ నెస్ సాధించడంతో విఫలమైన మహ్మదుల్లా స్థానంలో  షబ్బీర్ రహ్మాన్ జట్టులోకి వచ్చాడు. అలాగే మెహదీ హసన్ స్థానంలో రుబెల్ హుస్సెన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios