Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్: పరుగుల వేటలో 'కంగారె'త్తారు, భారత్ విజయం

ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్‌ వేదికగా భారత్ పై జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా పరుగుల వేటలో వెనకబడిపోయింది. చివరలో కారే ధాటిగా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత్ తమ ముందు ఉంచిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కంగారూలు చేతులెత్తేశారు.

icc world cup 2019, india vs australia, live updates
Author
London, First Published Jun 9, 2019, 2:45 PM IST

భారత్ తమ ముందు ఉంచిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాలో వికెట్లను కాపాడుకునే ప్రయత్నంలో పరుగుల వేటలో వెనకబడి పోయింది. చివరికి 36 పరుగుల తేడాతో భారత్ చేతిలో కంగారూలు ఓటమి చవి చూశారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగుుల చేయగా, ఆస్ట్రేలియా 316 పరుగులకు చేతులెత్తేసింది. కారే చివరలో ధాటిగా అడినప్పటికీ రెండో వైపు వికెట్లు పడుతూ వెళ్లాయి. కారే 35 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ మూడేసి వికెట్లు తీసుకోగా, చాహల్ కు రెండు వికెట్లు దక్కాయి.

ఆస్ట్రేలియా 313 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. స్టార్క్ 3 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు.ఆస్ట్రేలియా 300 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.అప్పటికి ఆసీస్ 18 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉండింది. కమిన్స్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

31 బంతుల్లో 70 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 44.4 ఓవర్ల వద్ద 283 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగులో కౌల్టర్ నీలే 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఆస్ట్రేలియా 244 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.మాక్స్ వెల్ 14 బంతుల్లో 28 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

ఆస్ట్రేలియా 10.2 ఓవర్లలో 115 పరుగులు చేయాల్సిన కీలకమైన దశలో నాలుగో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో స్మిత్ ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. స్మిత్ 70 బంతుల్లో 69 పరుగులు చేశాడు.ఆ వెంటనే భువనేశ్వర్ మరో వికెట్ తీశాడు. అదే స్కోరు వద్ద స్టోయినిస్ అవుటయ్యాడు.

ఆస్ట్రేలియా 36.4 ఓవర్ల వద్ద 202 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. స్మిత్ తో కలిసి ధాటిగా ఆడుతున్న ఉస్మాన్ ఖవాజాను బుమ్రా క్లీన్  బౌల్డ్ చేశాడు.ఖవాజా 39 బంతుల్లో 42 పరుగులు చేశాడు.అందులో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి.

ఆస్ట్రేలియా 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ రన్నవుటయ్యాడు. నిలకడగా ఆడుతూ స్కోరును పెంచుతున్న స్థితిలో చాహల్ డేవిడ్ వార్నర్, స్మిత్ జోడీని విడదీశాడు. డేవడ్ వార్నర్ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 133 పరుగులు చేసి రెండో వికెట్ ను కోల్పోయింది.

 తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై రెచ్చిపోయిన భారత బ్యాట్స్‌మెన్‌ ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేశారు. ఓపెనర్ వేసిన పునాదిపై మిగిలిన బ్యాట్స్‌మెన్ అద్బుతమైన ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొట్టాడు.

చివర్లో హార్డిక్ పాండ్యా రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 117, కోహ్లీ 82 , రోహిత్ శర్మ 57 పరుగులతో సత్తా చాటారు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్‌ 2, కమ్మిన్స్, స్టార్క్, కౌల్టర్ నైల్‌కు తలో వికెట్ పడగొట్టారు. 

స్కోరును పెంచేందుకు అద్భుతంగా ఆడిన ధోని.. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్కోరు బోర్డును పెంచే క్రమంలో విధ్వంసక ఆటగాడు హార్డిక్ పాండ్యా ఔటయ్యాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన పాండ్యా 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ సాధించాడు. 55 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో విరాట్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇది అతనికి వన్డేల్లో 50వ అర్ధసెంచరీ .సెంచరీ తర్వాత దూకుడుగా ఆడిన ధావన్.... స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి నాథన్ లేయన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 109 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో నిలకడగా ఆడిన ధావన్.. భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన నాటి నుంచి నిలకడగా ఆడిన ధావన్ 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

అంతకు ముందు ఓపెనర్ రోహిత్ శర్మ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో రోహిత్ హాఫ్ సంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టీమిండియా సెంచరీ మార్క్‌ను చేరుకుంది. ఓపెనర్‌లిద్దరూ నిలకడగా ఆడడంతో 19 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసింది..అప్పటికి శిఖర్ ధావన్ 53, రోహిత్ శర్మ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఓపెనర్ శిఖర్ ధావన్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 53 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.. 

ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియాలో మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. ఆసీస్‌పైనా గెలిచి సత్తా చాటింది.  

Follow Us:
Download App:
  • android
  • ios