Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్: విజృంభించిన ఆసీస్ బౌలర్లు, ఇంగ్లాండు చిత్తు

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో ఇంగ్లాండు ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ చేరుకున్నారు. 64 పరుగుల తేడాతో ఇంగ్లాండు కంగారుల చేతిలో ఓటమి పాలైంది.

ICC world cup 2019: Australia vs England match updates
Author
London, First Published Jun 25, 2019, 3:03 PM IST

లండన్: ఆస్ట్రేలియా బౌలర్ల విజృంభనకు ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ పూర్తిగా తలొగ్గారు..ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండు 64 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 44.4 ఓవర్లలో 221 పరుగులు చేసి ఇంగ్లాండు ఆలవుట్ అయింది. బెహ్రాండార్ఫ్ ఐదు వికెట్లు తీయగా, స్టార్క్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టోయినిస్ కు ఒక్క వికెట్ దక్కింది.

అంతకు ముందు 211 పరుగుల వద్ద ఇంగ్లాండు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆర్చర్ ఒక్క పరుగు మాత్రమే చేసి బెహ్రాండార్ఫ్ బౌలింగులోనే అవుటయ్యాడు. 202 పరుగుల స్కోరు వద్ద ఎనిమిదో వికెెట్ కోల్పోయింది. వోక్స్ 26 పరుగులు చేసి బెహ్రాండార్ఫ్ బౌలింగులో అవుటయ్యాడు. 189 పరుగుల స్కోరు వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ కేవలం 6 పరుగులు చేసి బ్రెహండార్ఫ్ బౌలింగులో వెనుదిరిగాడు.  ఓ వైపు వికెట్లు పడుతూ ఉన్నా నిలకడగా ఆడుతూ వచ్చిన బెన్ స్టోక్స్ 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగులో అవుటయ్యాడు. దాంతో ఇంగ్లాండు 177 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ వెన్ను చూపుతూ వచ్చారు. ఇంగ్లాండు 124 పరుిగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.బట్లర్ స్టోయినిస్ బౌలింగులో  25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.ఇంగ్లాండు 53 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బెయిర్ స్టో 39 బంతుల్లో 28 పరుగులు చేసి బెహ్రాండార్ఫ్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

ఇంగ్లాండు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఓపెనర్ విన్స్ డకౌట్ కాగా, రూట్ 8 పరుగులకు, కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ 4 పరుగులకు పెవిలియన్ కు క్యూ కట్టారు.

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్, ఫించ్ జోరును తర్వాత బ్యాట్స్ మెన్ కొనసాగించలేకపోయారు. చివరలో అలెక్స్ కారే దూకుడు ప్రదర్శించాడు. అతను 27 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు 4 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండు బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా, ఆర్చర్, వుడ్, స్టోక్స్, అలీ తలో వికెట్ తీసుకున్నారు. 

ఆస్ట్రేలియా 259 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ ఒక్క పరుగు మాత్రమే చేసి వోక్స్ బౌలింగులో అవుటయ్యాడు.అంతకు ముందు 250 పరుగుల వద్ద మరో కీలకమైన వికెట్ ను కోల్పోయింది. స్మిత్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగులో ఆరో వికెట్ గా వెనుదిరిగాడు.

ఆస్ట్రేలియా 228 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు.అంతకు ముందు 213 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాక్స్ వెల్ వుడ్ కు దొరికిపోాయాడు.

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా 173 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఖవాజా 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోయినిస్ పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికి ఆరోన్ ఫించ్ సెంచరీకి చేరువయ్యాడు. 116 బంతుల్లో సెంచరీ చేసిన ఆరోన్ ఫించ్ అర్చర్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 183 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండు ఎట్టకేలకు ఆస్ట్రేలియా తొలి వికెట్ తీయగలిగింది. 123 పరుగులు స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. 61 బంతుల్లో 53 పరుగులు చేసిన వార్నర్ మోయిన్ అలీ బౌలింగులో అవుటయ్యాడు. 

ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా  ఓపెనర్లు బలమైన ఆరంభాన్నిచ్చారు. ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ల ఓపెనింగ్ జోడీ భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. కెప్టెన్ ఆరోన్ పించ్ 61 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అర్థ సెెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో అస్ట్రేలియాపై టాస్ గెలిచి ఇంగ్లాండు ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పు చేసింది. నాథన్ లియోన్, జసోన్ బెహ్రెండార్ఫ్ ఆడమ్ జంపా, నాథన్ కౌల్టర్ నీలే స్థానాల్లో తుది జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండు మాత్రం తుది జట్టులో ఏ విధమైన మార్పులు కూడా చేయలేదు.   

ఆస్ట్రేలియా తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, మార్కూస్ స్టోయినిస్, అలెక్స్ కారె (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జాసోన్ బెహ్రెండార్ఫ్

ఇంగ్లాండు తుది జట్టు: జేమ్స్ విన్సే, జానీ బెయిర్ స్టో, జ్యో రూట్, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్

Follow Us:
Download App:
  • android
  • ios