Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండుపై మ్యాచ్: రోహిత్ సెంచరీ వృధా, చేతులెత్తేసిన ఇండియా

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో భారత్ చేతులెత్తేసింది. ఇంగ్లాండు తమ ముందు ఉంచిన 238 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో ఏ మాత్రం పోరాట పటిమ ప్రదర్శించలేదు. భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

England vs India, Live Cricket Updates, icc world cup
Author
London, First Published Jun 30, 2019, 3:01 PM IST

ప్రపంచ కప్ పోటీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ఇంగ్లాండు తమ ముందు ఉంచిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. రోహిత్ శర్మ చేసిన సెంచరీ వృధా అయింది. ధోనీ 42 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 12 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. ఇంగ్లాండు బౌలర్లలో ప్లంకెట్ 3 వికెట్లు తీసుకోగా, వోక్స్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఇంగ్లాండు సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇంగ్లాండుపై మ్యాచులో భారత బ్యాట్స్ మెన్ పోరాట పటిమను ప్రదర్శించకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. ధోనీ, కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేసిన తీరులో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. 

ఇంగ్లాండు తమ ముందు ఉంచిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 267 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.. ఇండియా 225 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ 32 పరుగులు చేసి ప్లంకెట్ బౌలింగులో వెనుదిరిగాడు.

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 106 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో అతను 100 పరుగులు చేశాడు. అప్పటికి భారత్ స్కోర్ 186 పరుగులు. సెంచరీ చేసిన కౌద్దిసేపటికే రోహిత్ శర్మ అవుటయ్యాడు. దీంతో భారత్ 198 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 102 పరుగులు చేసిన వోక్స్ బౌలింగులో అవుటయ్యాడు.

146 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 66 పరుగులు చేసి ప్లంకెట్ బౌలింగులో అవుటయ్యాడు.అంతకు ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 59 బంతులకు అర్థ సెంచరీ పూర్తి చేశాడు.ఆ తర్వాత రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు. అదిల్ రషీద్ వేసిన బంతిని ఫోర్ గా మలిచి 65 బంతుల్లో 52 పరుగులు చేశాడు.

ఇంగ్లాండు తమ ముందు ఉంచిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ కెఎల్ రాహుల్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. రాహుల్ వోక్స్ బౌలింగులో పరుగులేమీ చేయకుండా కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు.

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. తొలి నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.ఓపెనర్లు వేసిన పటిష్ట పునాదిపై మిగిలిన బ్యాట్స్‌మెన్లు మంచి ఇన్నింగ్స్‌ నిర్మించారు.ఈ క్రమంలో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసి భారత్ ముందు 337 పరుగుల టార్గెట్ ఉంచింది.

ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లలో బెయిర్‌స్టో 111, స్టోక్స్ 79, జేసన్ రాయ్ 66 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 5, కుల్‌దీప్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. షమీ ధాటికి ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. 49వ ఓవర్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వోక్స్ పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీకి క్యాచ్ ఇచ్చి బట్లర్ వెనుదిరిగాడు. 

ఇంగ్లాండ్ విధ్వంసక ఆటగాడు స్టోక్స్ అర్ధసెంచరీ చేశాడు. కీలకదశలో క్రీజులోకి వచ్చిన అతను. ఫోర్లు , సిక్సర్ల సాయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో స్టోక్స్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ కీలక దశలో నాలుగో వికెట్ కోల్పోయింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రూట్ వెనుదిరిగాడు.

ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 1 పరుగు చేసిన కెప్టెన్ మోర్గాన్.. షమీ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు కాస్తంత ఒత్తిడిలో పడింది. అయితే బట్లర్, స్టోక్స్ వంటి హిట్లర్లు ఉండటంతో ఆ జట్టు ఆందోళన చెందడం లేదు,. 

ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడుతూ.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతను అద్భుత ఇన్నింగ్స్‌ నిర్మించాడు.

ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్‌స్టో సెంచరీ చేశాడు. 90 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతని కెరీర్‌లో 8వ సెంచరీ. బ్యాటింగ్‌కు దిగినప్పటి నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బెయిర్‌స్టో.. మరో ఓపెనర్‌ జేసన్ రాయ్‌తో కలిసి తొలి వికెట్‌కు 160 పరుగులు జోడించాడు.

ఇంగ్లాండ్ ఓపెనర్ల విధ్వంసానికి తెర పడింది. ప్రమాదకర జేసన్‌రాయ్‌ ఔట్ అయ్యాడు. 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ బౌలింగ్‌లో జడేజా పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో జేసన్‌రాయ్ వెనుదిరిగాడు. భారత బౌలర్లను ఇంగ్లాండ్ ఓపెనర్లు బెంబేలెత్తింతారు..సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ ఇద్దరు అర్థసెంచరీలు సాధించారు. వీరి జోరుతో 15వ ఓవర్‌లోనే ఇంగ్లాండ్ సెంచరీ మార్క్‌‌ను దాటింది. 

ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అతను అర్థసెంచరీ చేశాడు. తొలి నుంచి దూకుడుగా ఆడిన అతను మరో ఓపెనర్ జేసన్ రాయ్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. 

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయశంకర్‌కు బదులుగా రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది. 

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రిషభ్‌పంత్‌, కేదార్‌ జాధవ్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ షమి, కుల్‌దీప్‌యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రిత్‌బుమ్రా

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జోరూట్‌, ఇయాన్‌మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌వోక్స్‌, అదిల్‌ రషీద్‌, లియమ్‌ ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌

Follow Us:
Download App:
  • android
  • ios