నాటింగ్‌హామ్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచులో వార్నర్ చెలరేగి ఆడి అద్భుతమైన సెంచరీని నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఖాతాలో అరుదైన రికార్డు నమోదయింది.

అత్యంత వేగంగా 16 సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును వార్నర్ సమం చేశాడు. 32 ఏళ్ల వార్నర్ 110 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ కూడా 110 ఇన్నింగ్స్‌ల్లోనే 16 సెంచరీలు సాధించాడు. 

కాగా, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా వీరిద్దరి  కన్నా ముందున్నాడు. ఆమ్లా కేవలం 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచులో వార్నర్ మొత్తం 147 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 166 పరుగులు చేశాడు.