Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండుపై మ్యాచ్: చాహల్ చెత్త రికార్డు

ప్రపంచ కప్ టోర్నీలో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (110 పరుగులు-ఇంగ్లండ్‌పై), శ్రీలంక పేసర్‌ నువాన్‌ ప్రదీప్‌ (88-ఆస్ట్రేలియా)లు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు. ఆ తర్వాత స్థానం చాహల్‌దే.

Chahal attains unwanted record during marquee clash in 2019 World Cup
Author
Birmingham, First Published Jun 30, 2019, 7:37 PM IST

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండుపై జరుగుతున్న మ్యాచులో భారత స్పిన్నర్ చాహల్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. తన వన్డే కెరీర్ లో అత్యధిక పరుగులను ఇచ్చుకున్న రికార్డును నెలకొల్పాడు. చాహల్‌ పది ఓవర్లు బౌలింగ్‌ వేసి 88 పరుగులు సమర్పించుకున్నాడు. 

అది చహల్‌కు వన్డేల్లో చెత్త ప్రదర్శనగా నమోదైంది. గతంలో వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడూ చాహల్‌ ఇంత భారీగా పరుగులు ఇవ్వలేదు.  ఈ వన్డే వరల్డ్‌కప్‌లో ఇది మూడో చెత్త ప్రదర్శనగా నమోదైంది. 
 
అంతకుముందు ప్రపంచ కప్ టోర్నీలో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (110 పరుగులు-ఇంగ్లండ్‌పై), శ్రీలంక పేసర్‌ నువాన్‌ ప్రదీప్‌ (88-ఆస్ట్రేలియా)లు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు. ఆ తర్వాత స్థానం చాహల్‌దే.

చాహల్ బౌలింగును ఇంగ్లాండు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, జోసెన్ రాయ్ ఉతికి ఆరేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios