134 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులు చేసిన టస్కన్ అహ్మద్...మహ్మదుల్లాతో కలిసి 9వ వికెట్‌కి 191 పరుగుల భారీ భాగస్వామ్యం...టస్కన్ అహ్మద్, జింబాబ్వే బౌలర్ ముజురబానీ మధ్య ఫన్నీ సంఘటన...

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య చిన్ని చిన్ని గొడవలు చాలా కామన్. ఆవేశంగా అరవడం, కళ్లు పెద్దవి చేసి చూడడం, కోపంగా కొట్టబోతున్నట్టు ముందుకు రావడం చాలా మ్యాచుల్లో జరిగేవే. జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఓ క్రేజీ సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హారారేలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో రోజు 294/8 ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టుకి మహ్మదుల్లా, టస్కీన్ అహ్మద్ కలిసి శతాధిక భాగస్వామ్యం అందించారు. 9వ వికెట్‌కి 191 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

టస్కన్ అహ్మద్ 134 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులు చేయగా, మోనిముల్ 92 బంతుల్లో 13 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. లిటన్ దాస్ 95 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మదుల్లా 150 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

Scroll to load tweet…

అయితే 4 వికెట్లు తీసిన జింబాబ్వే బౌలర్ ముజురబానీ బౌలింగ్‌లో ఓ షాట్ ఆడిన టస్కన్ అహ్మద్, క్రీజులోనే బ్యాటుతో నిలబడి స్టెప్పులు వేశాడు. దీంతో ముజురబానీ కోపంగా బ్యాట్స్‌మెన్ దగ్గరకి వెళ్లి, అతని కళ్లల్లో కళ్లు పెట్టి కోపంగా చూశాడు.

ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుందని అంపైర్లు దగ్గరికి వచ్చేలోపు, పెదాలతో ముద్దు ఇస్తున్నట్టు సైగ చేసిన ముజరబానీ, వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఈ క్రేజీ సంఘటనకు సంబంధించిన వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.