భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్ల మాయాజాలం ముందు న్యూజిలాండ్ క్రికెటర్లు తేలిపోయారు.  

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా సత్తా చాటింది. ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. మౌంట్ మాంగనూయ్‌లో జరిగిన ఆఖరి టీ20లో కివీస్‌పై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ముందు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు.

Also Read ఇండియా క్లీన్ స్వీప్ మూడోసారి: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా...

భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్ల మాయాజాలం ముందు న్యూజిలాండ్ క్రికెటర్లు తేలిపోయారు. 

View post on Instagram

మొత్తానికి న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఐదు మ్యాచులు భారతే సొంతం చేసుకుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే మీరే కాదు.. మేము కూడా సంబరాలు చేసుకుంటున్నామంటున్నరు చాహల్, శ్రేయాస్ అయ్యర్ .

వీరు మ్యాచ్ గెలిచిన అనంతరం తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు. వీరి చిందులు వేసిన వీడియోని ఇండియన్ క్రికెట్ టీమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.