భారత క్రికెటర్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. హర్యానాలో ఉంటున్న చాహాల్ తండ్రి కెకె చాహాల్, తల్లి సునీతా దేవీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కెకె చాహాల్ అడ్వకేట్‌‌గా పనిచేస్తున్నారు.

కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ స్వగృహంలోనే ఐసోలేషన్‌లో గడుపుతున్నారు. క్రికెట్‌తో పాటు చెస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యజ్వేంద్ర చాహాల్, యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడడంతో ఇంటికి చేరుకున్న చాహాల్, త్వరలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే.