Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాలో ఎంట్రీ కోసం అర్జున్ టెండూల్కర్ మాస్టర్ ప్లాన్..! ప్రత్యేక కోచ్ వద్ద శిక్షణ..

Sachin Tendulkar's Son: టీమిండియాలో సచిన్ శకం ముగిసి పదేండ్లు దాటుతున్నా ఇంకా అతడి కొడుకు అర్జున్ ఎంట్రీ లేదు. సచిన్ మాదిరిగానే అర్జున్ కూడా చిన్న వయసులోనే టీమిండియాలోకి వస్తాడని గతంలో వార్తలు వినిపించినా.. 
 

Yuvraj Singh's Father Yograj Singh Training  Arjun Tendulkar, Pics Went Viral
Author
First Published Sep 24, 2022, 4:11 PM IST

భారత క్రికెట్ అభిమానులు దేవుడిగా కొలుచుకునే బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్ బై చెప్పి దశాబ్దం దాటిపోయింది. అయితే సచిన్ మాదిరే అతడి కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు. కానీ టీమిండియాలో సచిన్ శకం ముగిసి పదేండ్లు దాటుతున్నా ఇంకా అర్జున్ ఎంట్రీ లేదు. సచిన్ మాదిరిగానే అర్జున్ కూడా చిన్న వయసులోనే టీమిండియాలోకి వస్తాడని  అప్పట్లో వార్తలు వినిపించినా అతడు మాత్రం ఇంకా దేశవాళీ క్రికెట్‌లో కూడా మెరవడం లేదు. అయితే ఇలా అయితే వర్కవుట్ కావడం లేదనుకున్న అర్జున్ మాస్టర్ ప్లాన్ వేశాడు. 

ఇటీవలే రంజీ జట్టు మారిన అర్జున్.. తాజాగా తన బ్యాటింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి ఓ ప్రత్యేక కోచ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఆ కోచ్ ఎవరో కాదు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్, సచిన్ కు  ఆత్మీయుడు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్.  

అర్జున్ ప్రస్తుతం యోగరాజ్ వద్దే ట్రైన్ అవుతున్నాడు. ఛండీగఢ్ లోని యువీ క్రికెట్ అకాడమీలో యోగరాజ్.. అర్జున్ కు బ్యాటింగ్ మెళుకువలు నేర్పుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

యోగరాజ్ గతంలో తన కొడుకు యువరాజ్ సింగ్ ను ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దాడు.  అంతర్జాతీయ స్థాయిలో యువీ సృష్టించిన రికార్డులతో అర్జున్ కూడా అతడి వద్దే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సచిన్ మాదిరిగా అర్జున్ తొలి ప్రాధాన్యం  బ్యాటింగ్ కాదు. అతడు లెఫ్టార్మ్ పేసర్. కానీ బ్యాటింగ్ కూడా చేయగలడు. సచిన్ తన కొడుకును మరో బెన్ స్టోక్స్ చేయాలని భావిస్తున్నట్టు.. ఆ మేరకు అతడికి శిక్షణ ఇప్పిస్తున్నట్టు గతంలో వార్తలు కూడా వినిపించాయి. ఆ క్రమంలోనే అర్జున్.. యోగరాజ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. 

 

ఇక ఐపీఎల్ లో 2021, 22 సీజన్ లో ముంబై ఇండియన్స్ సభ్యుడిగా ఉన్నా అర్జున్ కు ఆడే అవకాశమైతే దక్కలేదు. ఇక దేశవాళీలో ముంబై తరఫున ఆడేందుకు కూడా అర్జున్ కు అవకాశాలు లేకపోవడంతో అతడు ఇటీవలే గోవా జట్టుకు మారాడు. రాబోయే రంజీ సీజన్ లో  అతడు గోవా తరఫున ఆడనున్నాడు.  రంజీలలో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడేందుకు అర్జున్ తాపత్రాయపడుతున్నాడు. మరి యోగరాజ్ వద్ద తీసుకుంటున్న శిక్షణ  అర్జున్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందనేది కాలమే నిర్ణయించనున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios