Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లోనూ యూసఫ్ పఠాన్ విధ్వంసం... ఇలాంటి బ్యాటర్‌ని టీమిండియా సరిగ్గా వాడుకోలేకపోయిందా!

11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్... యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లో న్యూజెర్సీ లెజెండ్స్‌కి వరుసగా రెండో విజయం.. 

Yousuf pathan sensational innings in US Masters T10 after Zim Afra Series, Team India fans angry on Dhoni CRA
Author
First Published Aug 22, 2023, 1:25 PM IST

వెస్టిండీస్ విధ్వంకర బ్యాటర్ క్రిస్ గేల్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ, లెజెండరీ క్రికెటర్ల జాబితాలో చేరుస్తారు. అయితే సరిగ్గా ఈ ఇద్దరికీ సమానమైన ప్లేయర్, మనకి దొరికినా టీమిండియా సరిగ్గా వాడుకోలేకపోయింది. అతనే యూసఫ్ పఠాన్. 2008 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యూసఫ్ పఠాన్, టీమిండియా తరుపున ఆడింది మొత్తంగా 57 వన్డేలు, 22 టీ20 మ్యాచులే...

తన ఆప్తి మిత్రుడు సురేష్ రైనాని టీమ్‌లో కొనసాగించడం కోసమే ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్‌ని మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ నుంచి తప్పించాడని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత ఫారిన్ లీగుల్లో ఆడుతున్న యూసఫ్ పఠాన్, జింబాబ్వే ఆఫ్రా టీ20 లీగ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు..

26 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 80 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్, పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ వేసిన 8వ ఓవర్‌లో 6, 6, 0, 6, 2, 4 బాది... తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు..

కాలిఫోర్నియా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజెర్సీ లెజెండ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ మిలింద్ కుమార్ 14 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసి రనౌట్ కాగా ఇర్ఫాన్ పఠాన్ 1 పరుగు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు..

ఈ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది న్యూజెర్సీ లెజెండ్స్. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జెస్సీ రైడర్ 19 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా భారత మాజీ వికెట్ కీపర్ నమన్ ఓజా 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. ఆల్బీ మోర్కెల్ 8 పరుగులు చేసి రనౌట్ కాగా యూసఫ్ పఠాన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. 318.18 స్ట్రైయిక్ రేటుతో యూసఫ్ పఠాన్ సృష్టించిన విధ్వంసానికి 8.1 ఓవర్లలో 98 పరుగులకు చేరుకుంది న్యూజెర్సీ లెజెండర్సీ..

యూసఫ్ పఠాన్ అవుటైనా క్రిస్టోఫర్ బార్న్‌వాల్ 12, పీటర్ ట్రావో 11 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు. 40 ఏళ్ల వయసులో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం అంత తేలికైన విషయం కాదు. క్రిస్ గేల్ కూడా కెరీర్ చివర్లో పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడ్డాడు. యూసఫ్ పఠాన్ మాత్రం సునాయాసంగా సిక్సర్లు బాదేస్తున్నాడు. యూసఫ్ పఠాన్ ఆడిన 11 బంతుల్లో అవుటైన ఓ బంతి తీసేస్తే మిగిలిన 10 బంతుల్లో 6 బౌండరీలు, 3 సింగిల్స్ తీశాడు.. దీంతో యూసఫ్ పఠాన్ లాంటి బ్యాటర్‌ని టీమిండియా సరిగ్గా వాడుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios