Asianet News TeluguAsianet News Telugu

గ్యాస్ సిలిండర్లు మోస్తున్న రింకూ సింగ్ తండ్రి.. వీడియో వైరల్

Rinku Singh: టీమిండియాలో తన స్థానాన్ని నిరంతరం పదిలం చేసుకుంటున్న యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ తండ్రికి సంబంధించిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రింకూ సింగ్ తండ్రి ఇప్పటికీ గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తూ కనిపించారు.
 

Young Indian cricketer Rinku Singh's father is carrying LPG gas cylinders viral Video RMA
Author
First Published Jan 28, 2024, 5:17 PM IST

Rinku Singh father video: ఇండియాన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో అద‌ర‌గొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయ‌ర్ రింకూ సింగ్. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున అడుతూ ఇప్ప‌టికే చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ తో జ‌ట్టులో త‌న స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంటున్నాడు. అయితే, టీమిండియా సూప‌ర్ ఫినిష‌ర్ గా ఎదుగుతున్న ఈ యంగ్ స్టార్ రింకూ సింగ్ తండ్రికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రింకూ సింగ్ తండ్రి ఇప్పటికీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నాడు. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు పలు కామెంట్లు చేస్తున్నారు. త‌న కుమారుడు టీమిండియాలో స్టార్ గా ఎదుగుతున్న గ‌ర్వానికి పోకుండా ఇంకా త‌మ‌కు జీవ‌నం కొన‌సాగించ‌డానికి తోడుగా ఉన్న ప‌నిని కొన‌సాస్తున్నారు. రింకూ సింగ్ తండ్రి సిలిండ‌ర్లు మోస్తూ ప‌ని చేస్తున్న ఆ వీడియో పై కామెంట్లు వెల్లువెత్తుతుండ‌టంతో సోష ల్ మీడియాలో విపరీతంగా వైర ల్ అవుతోంది.

 

టీమిండియా స్టార్ గా ఎదుగుతున్న రింకూ సింగ్..

యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ ఇటీవలి కాలంలో భారత క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తు మంచి గుర్తింపు సాధించాడు. టీ20 మ్యాచ్ లో ఫినిషర్ గా తన పాత్ర పోషిస్తున్న రింకూ సింగ్ జట్టులో తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నాడు. ఏ ఆటగాడికైనా ఇది అంత సులువు కాదు కానీ రింకూ సింగ్ త‌న బ్యాట్ తో రాణిస్తూ స‌త్తా చాటుతున్నాడు. గతంలో ఐపీఎల్లో వరుసగా 5 సిక్సర్లు బాది జట్టుకు అసాధ్య విజయాన్ని అందించిన రింకూ వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత రింకూ సింగ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు.

IND vs ENG: అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ !

పేద కుటుంబం నుంచి వ‌చ్చిన రింకూ సింగ్..

క్రికెటర్ రింకూ సింగ్ జీవితం అంత సులువుగా ఇక్క‌డివ‌ర‌కు రాలేదు. లైమ్ లైట్ లోకి రాకముందు రింకూ స్వయంగా తన తండ్రితో కలిసి గ్యాస్ సిలిండర్ల డెలివరీ చేసేవాడు. పలు చోట్ల పారిశుధ్య పనులు కూడా చేశారు. ఇటీవ‌లే ఒక కొత్త ఇళ్లును కొన్నార‌ని స‌మాచారం. అయితే, ఇప్పుడు రింకూ సింగ్ తండ్రి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టెస్టు క్రికెట్ కెరీర్ లో రవీంద్ర జడేజాకు ఇదే తొలిసారి.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios