36 ఏళ్ల వయసులోనూ జట్టులో రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న దినేశ్ కార్తీక్...ఇంగ్లాండ్ టూర్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న డీకే... దినేశ్ కార్తీక్‌ ఫోటోలపై కామెంట్ చేసిన రోహిత్ శర్మ...

అంతర్జాతీయ క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకముందే, కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు దినేశ్ కార్తీక్. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్, ఆ తర్వాత ఇంగ్లాండ్- శ్రీలంక, ఇంగ్లాండ్ -పాకిస్తాన్ మధ్య సిరీస్‌లకు కామెంటరీ చెప్పాడు.

తన చమత్కారంతో ఫన్నీ కామెంట్లతో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసిన దినేశ్ కార్తీక్, 2021 టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తానని చెప్పాడు. 36 ఏళ్ల వయసులోనూ జట్టులో రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న దినేశ్ కార్తీక్, ఇంగ్లాండ్ టూర్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

View post on Instagram

‘జస్ట్ మీ, బీయింగ్ మీ’ అంటూ కాప్షన్‌ ఇస్తూ పోస్టు చేసిన ఈ ఫోటోలపై భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. ‘నీలో ఇంకా కొంచెం క్రికెట్ మిగిలే ఉందయ్యా... ఫర్ యువర్ ఇన్‌ఫర్మమేషన్...’ అంటూ కామెంట్ పెట్టాడు రోహిత్ శర్మ...

దీనికి స్పందించిన దినేశ్ కార్తీక్... ‘అందులో ఎప్పుడూ డౌట్స్ అక్కర్లేదు శామ్...’ అంటూ కన్నుకొడుతున్న ఎమోజీ పోస్టు చేశాడు. ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్- ఇండియా టెస్టు సిరీస్‌కి కూడా కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు దినేశ్ కార్తీక్...