Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ కేక్ కూడా తినేసిన అనుష్క.. విరాట్ రియాక్షన్ ఇదే..!

ఇటీవల, ప్రమోషనల్ పోస్ట్ సందర్భంగా అనుష్క తన అందమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె కేక్ తిన్నాను అంటూ చేతులు చూపిస్తూ, ఫోటో షేర్  చేయగా, దానికి కోహ్లీ ఇచ్చిన రిప్లై ఫన్నీగా ఉండటం విశేషం.

You Finished My Cake Too Virat Kohli's Comment On Anushka Sharma's Post Is Sweet As Love ram
Author
First Published Sep 30, 2023, 9:55 AM IST


టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ , ఆయన భార్య బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జోడి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ ఇద్దరికీ  సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి జోడికి కూడా స్పెషల్ గా ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక, వీరిద్దరూ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటారు.

తమ ఫోటోలను, తమ మధ్య జరిగిన ఫన్నీ సందర్భాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.  ఇటీవల, ప్రమోషనల్ పోస్ట్ సందర్భంగా అనుష్క తన అందమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె కేక్ తిన్నాను అంటూ చేతులు చూపిస్తూ, ఫోటో షేర్  చేయగా, దానికి కోహ్లీ ఇచ్చిన రిప్లై ఫన్నీగా ఉండటం విశేషం.

 

అయితే, ఆ పోస్టుకి కోహ్లీ, నా కేక్ కూడా తినేశావా అంటూ కామెంట్ చేయడం విశేషం. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, ఈ దంపతులు ఇటీవల వినాయక చవితి సంబరాల్లోనూ  పాల్గొన్నారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తోంది. త్వరలోనే  ఈ వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం కోహ్లీ  కూడా కసరత్తులు చేస్తున్నాడు. రీసెంట్ గా ఆసియా కప్ లో టీమిండియా విజయం సాధించింది. కోహ్లీ సైతం తన ఆటతో సిరీస్ విజయానికి తోడ్పడ్డాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios