యాసిర్‌ షా శతకం, బాబర్‌ అజామ్‌ల పోరాటం పాకిస్తాన్‌ను ఫాలో ఆన్‌ ప్రమాదం నుంచి మాత్రం తప్పించలేకపోయాయి. పాకిస్తాన్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్‌ అవడంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాల్చి వచ్చింది.

ఆసీస్ కెప్టెన్ టిమ్ పెయిన్ పాకిస్తాన్ ను ఫాలో ఆన్ ఆడవాలిసిందిగా చెప్పడంతో పాకిస్తాన్ ఆడక తప్పలేదు.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు కంటే 287 పరుగులు వెనుకబడింది.  

యాసిర్ షా సెంచరీ... 

ఆసీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్‌ స్పిన‍్నర్‌ యాసిర్‌ షా ఒక చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు మాత్రమే తీసి నాలుగు వందలకు పైగా పరుగులిచ్చి అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. 

Also read: ఇంత వివక్షా... క్రీడా సమాఖ్యల పరిపాలనకు మహిళలు పనికిరారా?

దాంతో యాసిర్‌ షాను పాక్‌ మాజీలు, అభిమానులు ఒక రేంజిలో విమర్శించారు. దీనితో వీరందరికి బళ్లతో కాదు బ్యాట్ తో సమాధానం చెబుదామనుకున్నాడేమో...  ఏకంగా సెంచరీతో విమర్శకుల నోర్లు మూయించాడు.  

పరుగులు ఇవ్వడమే కాదు.. తనకు పరుగులు చేయడం కూడా తెలుసని చెప్పదల్చుకున్నాడేమో.. ఇలా సెంచరీ బాదేశాడు. పాకిస్తాన్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఈ స్పిన్నర్ శతకంతో మెరిశాడు. 

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆసీస్‌ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. చివరకు మాత్రం మూడంకెల స్కోరును చేరుకున్నాడు. మరో పాకిస్తాన్ ఆటగాడు బాబర్‌ అజామ్‌(97) తృటిలో సెంచరీని కోల్పోతే, యాసిర్‌ షా మాత్రం శతకం బాదేశాడు. 

ఏడో వికెట్‌కు అజామ్‌తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన యాసిర్‌ షా.. మహ్మద్‌ అబ్బాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.  ఇలా చక్కదిద్దుతూనే, 192 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ చేసాడు. యాసిర్‌ షాకు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం.  

Also read: మధ్యలో నా భార్య పేరు ఎందుకు.. విరాట్ గరం గరం

రెండో ఇన్నింగ్స్ లోను పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ అనుకున్నంతమేర రాణించలేకపోతున్నారు. వర్షం భారీగా పడుతుండడంతో. ఈ రోజు ఆటను నిలిపేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. గత ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన బాబర్ ఆజాం ఈ ఇన్నింగ్స్ లో రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయారు. 

ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే పింక్ బాల్ మ్యాచుల్లో యాసిర్ షా కి ఒక బ్రహ్మాండమైన రికార్డు ఉంది. సాధారణంగా పింక్ బాల్ స్పిన్ బౌలర్లకు అనుకూలం కాదు. కానీ యాసిర్ షా మాత్రం పింక్ బాల్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ని నమోదు చేసాడు. 6/184 రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.