Asianet News TeluguAsianet News Telugu

డబ్ల్యూటీసీ 2021-2023 కాలంలో అత్యధిక పరుగులు చేసిందెవరు..? భారత్ నుంచి మరీ దారుణం!

WTC Finals 2023: డబ్ల్యూటీసీ 2021 - 2023 కాలానికి గాను  ఫైనల్  మ్యాచ్ ఈనెల 7న మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రెండేండ్ల కాలంలో అత్యధిక పరుగులు సాధించిన   బ్యాటర్లు ఎవరో ఇక్కడ చూద్దాం. 

WTC Finals 2023: Here is The List Of Most Runners in WTC 2021 - 2023 Season MSV
Author
First Published Jun 2, 2023, 4:23 PM IST

2021- 2023 కాలానికి గాను  ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో  పలువురు బ్యాటర్లు పండుగ చేసుకున్నారు.  ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్, ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాలతో పాటు పాకిస్తాన్ కెప్టెన్  బాబర్ ఆజమ్ లు సూపర్ ఫామ్ కొనసాగించారు. మరికొద్దిరోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో  ఇప్పటివవరకు  టాప్ - 5 బ్యాటర్ల జాబితాను ఇక్కడ చూద్దాం. 

డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత్ - ఆస్ట్రేలియా  మధ్య  జూన్  7 నుంచి కీలక సమరం జరగాల్సి ఉన్నది. అయితే అత్యధిక పరుగుల వీరుల జాబితాలో భారత్ నుంచి  టాప్ - 15లో కూడా టీమిండియా  బ్యాటర్లు లేకపోవడం గమనార్హం. 

2021-2023 కాలానికి డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ - 5 బ్యాటర్స్ : 

1. జో రూట్ : 22 టెస్టులు ఆడి 40 ఇన్నింగ్స్ లలో 53.19 సగటుతో 1,915 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 8 సెంచరీలు ఆరు అర్థ సెంచరీలున్నాయి. 
2. ఉస్మాన్ ఖవాజా : ఈ ఆసీస్ ఓపెనర్.. రెండేండ్లలో  16 టెస్టులు ఆడి 28 ఇన్నింగ్స్ లలో  1,608 రన్స్ చేశాడు.  50.40 సగటుతో  ఖవాజా.. ఆరు  సెంచరీలు, ఏడు అర్థ  పెంచరీలు సాధించాడు. 
3. బాబర్ ఆజమ్ : పాకిస్తాన్ సారథి బాబర్..  14 మ్యాచ్ లలో 26 ఇన్నింగ్స్ ఆడి  1,527 పరుగులు  చేశాడు.  ఇందులో 4 సెంచరీలు, 10 హాఫ్  సెంచరీలున్నాయి. 
4. లబూషేన్ : ఆసీస్ వన్ డౌన్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ .. 19 టెస్టులలో 33 ఇన్నింగ్స్ ఆడి  1,509 రన్స్ చేశాడు.  లబూషేన్ ఐదు సెంచరీలు, ఐదు హాఫ్  సెంచరీలు సాధించాడు. 
5. జానీ బెయిర్ స్టో :  ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో.. 15 మ్యాచ్ లలో  28 ఇన్నింగ్స్ ఆడి  1,285 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు.   

బెయిర్ స్టో తర్వాత  స్మిత్ (1,252), ట్రావిస్ హెడ్ (1,208), కరుణరత్నె (1,054), లిటన్ దాస్ (1,024) లు వెయ్యికి పైగా పరుగులు చేసినవారిలో ఉన్నారు. 

 

భారత్ నుంచి.. 

ఈ జాబితాలో టీమిండియా నుంచి టాప్ - 15 లో ఒక్క బ్యాటర్ కూడా లేడు.   ఇండియా నయావాల్  ఛటేశ్వర్ పుజారా.. 16 మ్యాచ్ లలో 30 ఇన్నింగ్స్ ఆడి 887 పరుగులు సాధించి  19 వ స్థానంలో ఉన్నాడు.  పుజారా తర్వాత 22వ స్థానంలో విరాట్ కోహ్లీ (869), 23 వ స్థానంలో రిషభ్ పంత్ (868) 23వ స్థానంలో ఉన్నాడు.  టీమిండియా సారథి రోహిత్ శర్మ.. 10 మ్యాచ్ లు ఆడి 17 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి  700  పరుగులు సాధించి 32వ స్థానంలో నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios